ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సింగ‌ర్ సునీత‌.. ఆ ప్లేస్‌ ఎక్కడై ఉంటుంద‌బ్బా?

Update: 2021-02-14 13:15 GMT
ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహం వైభవంగా జరిగిన విష‌యం తెలిసిందే. మ్యాంగోమూవీస్ అధినేత, బిజినెస్ ‌మెన్‌ రామ్‌ వీరపనేని సునీత మెడలో మూడుముళ్లు వేశారు. జనవరి 9న ఒక్కటైందీ జంట‌. హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత-రామ్ వివాహం ఘనంగా జరిగింది.

ఈ వేడుక అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెహందీ ఫంక్షన్ కు సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ తోపాటు, యాంకర్ సుమ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఇక‌, సునీత రెండో పెళ్లిపై ఓ వ‌ర్గం విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అవ‌న్నీ లైట్ తీసుకున్న సునీత‌.. పిల్ల‌ల స‌మ‌క్షంలో ఆనందంగా వివాహం చేసుకున్నారు.

పెళ్లి త‌ర్వాత కూడా సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ట‌చ్ లో ఉన్న సునీత‌.. త‌న అప్డేట్స్ ను పోస్ట్ చేస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ప‌లు ఫొటోల‌ను షేర్ చేసి, త‌న జీవితం ఇప్పుడు ఎంతో అందంగా, ఆనందంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. అయితే.. తాజాగా మ‌రో ఫొటో షేర్ చేసింది సునీత. తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ పిక్ లో చాలా హ్యాపీగా ఉన్నారు సునీత‌.

అంతేకాదు.. ఆ ఫోటో చూస్తుంటే వెకేషన్ కు వెళ్లినట్లు క్లియ‌ర్ గా తెలుస్తోంది. అది కూడా ప్రేమికుల దినోత్స‌వం రోజున పోస్ట్ చేయ‌డంతో.. ఖ‌చ్చితం హాలీడే టూర్ కు వెళ్లిన‌ట్టుగానే తెలుస్తోంది. అయితే.. ఆ వెకేష‌న్ కు సంబంధించిన లొకేష‌న్ ఏంటి? అన్న‌దే అర్థం కావ‌ట్లేదు.

ఈ ఫొటో బ్యాక్‌గ్రౌండ్ చూస్తే.. మాల్దీవులకు వెళ్లారేమో అనిపిస్తోంది. నెటిజన్లు కూడా అదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మరి, ఎక్క‌డికి వెళ్లారు? అనే విషయంపై సునీత మాత్ర‌మే క్లారిటీ ఇవ్వ‌గ‌ల‌రు. ఆ లోకేష‌న్ ఎక్క‌డో అయిన‌ప్ప‌టికీ.. ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సునీత హ్యాట్, గాగుల్స్ సూప‌ర్బ్ గా ఉన్నాయి.


Tags:    

Similar News