కారు ప్రమాదంలో గాయకుడు దుర్మరణం!
పంజాబీ గాయకుడు దిల్జాన్ మార్చి 30 మంగళవారం ఉదయం అమృత్‌సర్ సమీపంలోని జండియాలా గురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. అమృత్ సర్ నుండి కర్తార్ పూర్ వెళుతుండగా, దిల్జాన్ కారు జలంధర్ జిటి రోడ్డులో పక్కన ఆపి ఉంచిన ట్రక్కును ఢీ కొట్టింది. ఆగి ఉన్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దిల్జాన్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలేంటనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. గాయకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే అతి వేగం వలననే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దిల్జాన్ భార్య, పిల్లలు కొన్నాళ్లుగా కెనడాలో ఉంటున్నారు. ఈ వార్త తెలిసిన వారు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి పంజాబీ సంగీత పరిశ్రమ సంతాపం తెలియజేసింది. చాలా మంది ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్‌లో దిల్జాన్ కు సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కాగా కార్తర్‌పూర్ ప్రాంతానికి చెందిన దిల్జాన్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు కెనడాలో నివసిస్తున్నారు.