బరువు తగ్గాడు భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాడు
ఈమద్య కాలంలో స్టార్ హీరోలు తమ మనసుకు నచ్చిన పాత్రలు చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. బరువు పెరగడం లేదా తగ్గడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎన్నో సాహసాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా డూప్ లు పెట్టి మ్యానేజ్ చేద్దాం అన్న పద్దతిలో ఎవరు కూడా కనిపించడం లేదు. తమిళ స్టార్ హీరో శింబు ప్రస్తుతం నటిస్తున్న ఈశ్వరన్ సినిమా కోసం ఏకంగా 30 కేజీల బరువు తగ్గాడు అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక హీరో పాత్ర కోసం అంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. చాలా నెలలు కష్టపడి శింబు బరువు తగ్గాడు. ఇప్పుడు మళ్లీ శింబు సినిమా కోసం కష్టపడుతున్నాడు.
శింబు దాదాపుగా నాలుగు పదుల వయసుకు చేరువ అయ్యాడు. ఇలాంటి సమయంలో సాదారణ డాన్స్ అంటేనే కష్టం. అది కూడా కొత్తగా నేర్చుకోవడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు. అలాంటిది ఈ వయసులో శింబు భరత నాట్యం నేర్చకుంటున్నాడు. ఈశ్వరన్ సినిమా కోసం శింబు తో భరతనాట్యం చేయంచాలని దర్శకుడు సుశీంద్రన్ భావించాడు. దర్శకుడి సూచన మేరకు ఈయన భరత నాట్యంలో ప్రావిణ్యం పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. నటిగా పలు సినిమాల్లో కనిపించిన శరణ్యా మోహన్ వద్ద శింబు భరత నాట్యం శిక్షణ పొందుతున్నాడు. మొత్తానికి ఈమద్య కాలంలో కనిపించకుండా పోయిన సూపర్ హిట్ ను శింబు ఈసారి దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.