బాలీవుడ్ యాక్టర్ల మరణానికి 2020కి లింక్ ఉందా...?

Update: 2020-05-02 01:30 GMT
ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ మరణించడంతో భారత చిత్ర పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. ఒక్కరోజు వ్యవధిలోనే దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్ - రిషికపూర్ తుది శ్వాస విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు. వీరి మరణంతో సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరూ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో బాలీవుడ్ తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొన్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా నిన్న రిషికపూర్ చికిత్స పొందుతూ మరణించాడు. వీరి మరణం అటు కుటుంబ సబ్యులకు ఇటు అభిమానులకు తీరని లోటని భాదపడుతున్న సమయంలో సోషల్ మీడియాలో వీరి మరణాలపై సిల్లీ లాజిక్స్ చెప్తున్నారు. ఇర్ఫాన్ కహాన్ - రిషికపూర్ యాదృచ్ఛికంగా మరణించారని తెలుపుతూ సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన లాజిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.. అదే సమయంలో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లాజిక్ ప్రకారం.. ఇర్ఫాన్ ఖాన్ 1967లో జన్మించాడు.. అతను మరణించినప్పుడు వయస్సు 53 సంవత్సరాలు. ఈ రెండిటినీ కలిపితే 1967 + 53 = 2020 వస్తుంది. అలాగే మరోవైపు రిషి కపూర్ 1953లో జన్మించాడు.. మరణించేటప్పుడు అతని వయస్సు 67 సంవత్సరాలు. ఈ రెండిటినీ కలిపితే 1953 + 67 = 2020 వస్తుంది. ఈ విధంగా కాలిక్యులేట్ చేసి 2020 సంవత్సరంలో ఇర్ఫాన్ - రిషికపూర్ చనిపోయారంటూ 2020ని బ్లేమ్ చేస్తున్నారు. ఈ సిల్లీ లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు సెలెబ్రెటీలతో పాటు కొన్ని మీడియా హౌసెస్ కూడా ఈ లాజిక్ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి విమర్శలకు గురవుతున్నారు.

మరోవైపు కామన్సెన్స్ తో ఆలోచించేవారు మాత్రం వీరి లాజిక్ ని ట్రోల్ చేస్తున్నారు. వారిద్దరి మరణాలలో యాదృచ్ఛికంగా జరిగింది ఏంటనే దురదృష్టవశాత్తు ఇద్దరూ 2020లో మరణించారు. అంతేకాకుండా ఇద్దరూ వేరు వేరు క్యాన్సర్స్ తో బాధపడ్డారు. రిషి కపూర్ లుకేమియా క్యాన్సర్‌ తో ఇబ్బంది పడగా.. ఇర్ఫాన్ ఖాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనే క్యాన్సర్‌ వ్యాధితో బాధపడ్డాడు. నిజానికి 2020 ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ గుర్తిండిపోయే ఏడాదిగా మిగిలిపోయిందని చెప్పవచ్చు.
Tags:    

Similar News