గుట్టు లీక్‌! ర‌హ‌స్య ఏజెంట్ ప్రేమ‌లో నిండా మునిగిన‌ ర‌ష్మిక‌..!

Update: 2021-02-11 07:30 GMT
ఇటీవ‌ల కొంత‌కాలంగా టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ర‌ష్మిక సౌండ్ అంత‌గా వినిపించ‌డం లేదేమిటో. ఉన్న‌ట్టుండి మ‌టుమాయ‌మైంది. మొన్న‌టివ‌ర‌కూ అంతా తానై సంద‌డి చేసిన ర‌ష్మిక ఉన్న‌ట్టుండి ఏమైంది? అంటూ యూత్ ఒకటే ఆరాలు తీస్తున్నారు. అయితే వీళ్లంద‌రికీ ఓ టాప్ సీక్రెట్ చెప్పాలి. ఆ గుట్టు కాస్తా విప్పాలి. అస‌లింత‌కీ ర‌ష్మిక ఏమైంది?  టాలీవుడ్ కి టాటా చెప్పి ఎటైనా వెళ్లిందా? అంటే.. అవును బాలీవుడ్ లోకి వెళ్లిపోతోంది.

ప్ర‌స్తుతం అక్క‌డ వ‌రుస సినిమాల‌కు క‌మిట‌వుతూ టాలీవుడ్ హీరోల‌కు సంత‌కం చేసే ఆలోచ‌న‌ను విర‌మించుకుంది. త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చిన ఏ పెద్ద హిందీ ఆఫ‌ర్ ని ర‌ష్మిక విడిచిపెట్ట‌డం లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ యువ‌హీరో సిద్ధార్థ్ స‌ర‌స‌న మిషన్ మజ్ను అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ మూవీ షూట్ మొదటి రోజు సిద్దార్థ్ మల్హోత్రా రష్మిక మంద‌న్న కలిసి పోజులివ్వ‌గా అవి టాలీవుడ్ లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

మిషన్ మజ్ను షూట్ నుండి బయటపడటానికి లక్నోకు బయలుదేరిన తరువాత సిద్ధార్థ్ మల్హోత్రా స్వ‌యంగా రష్మిక మంద‌న్నతో కలిసి డే వ‌న్ సెట్లో ఉన్న‌ప్ప‌టి ఒక స్నీక్ పీక్ ఫోటోను షేర్ చేసారు. ఇంతకు ముందెన్నడూ చూడని రహస్య ఏజెంట్ అవతార్ ‌లో సిధార్థ్ క‌నిపిస్తున్నాడు. ఆస‌క్తిక‌రంగా ఇందులో ర‌ష్మిక కూడా లేడీ స్పై గా యాక్ష‌న్ రోల్ లో క‌నిపించ‌నుంది‌. ఇక ఈ ఫోటోకి స్పెష‌ల్ వ‌న్ అన్న క్యాప్ష‌న్ ఇచ్చి ర‌ష్మిక అభిమానుల దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకుంది. అన్న‌ట్టు ఈ స్పెష‌ల్ వ‌న్ తో ర‌ష్మిక ల‌వ్ ట్రాక్ కూడా ఉంటుందా? అన్న‌ది త‌నే చెప్పాలి. ఇక ర‌హ‌స్య ఏజెంట్ల మ‌ధ్య ప్రేమాయ‌ణం ఉంటుందా? అన్న‌ది చూడాలి.

ఈ చిత్రం 1970 నేప‌థ్యంలో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో తెర‌కెక్కిస్తున్నారు. నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. శత్రు శ్రేణుల వెనుక భార‌తీయ‌ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేపట్టిన ఘోరమైన రహస్య ఆపరేషన్ ఏంటీ అన్న‌దే తెర‌పై చూపించ‌నున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను 2020 డిసెంబర్ 23న సిద్దార్థ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

మిషన్ మజ్ను డే 1 షూట్ ఫోటోను షేర్ చేయ‌గానే అది వైర‌ల్ గా మారింది. ఈ చిత్రానికి పర్వీజ్ షేక్- అసీమ్ అరోరా-సుమిత్ బతేజా ర‌చ‌యిత‌లు. శాంతను బాగ్చి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రోనీ స్క్రూవాలా- గారిమా మెహతా- అమర్ బుటాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News