• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరోసారి జతకట్టనున్న...

మరోసారి జతకట్టనున్న ఇద్దరు నేచురల్ స్టార్స్!

By - Tupaki Desk
Update: 2020-05-27 23:30 GMT
నేచురల్ స్టార్ నాని, నేచురల్ హీరోయిన్ సాయిపల్లవి మూడేళ్ల కిందట `ఎమ్‌సీఏ` సినిమాలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సందడి ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. తమ సహజ నటనతో ఈ జంట తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. త్వరలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. 'ఎంసిఏ' సినిమాలో కలసి నటించిన నాని, సాయిపల్లవి జంట మరోసారి త్వరలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించనున్నారట. రాహుల్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడు. దీనికి 'శ్యాం సింగ రాయ్' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో సాయిపల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ సాయిపల్లవితో సంప్రదింపులు జరుపుతోందట.

ఇక ఆ పాత్ర కూడా సాయిపల్లవికి బాగా నచ్చిందనీ సమాచారం. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కథానాయిక పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందనీ, అందుకే ఆమె ఒప్పుకుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ శ్యామ్ సింగరాయ్ సినిమా నాటి పిరియాడిక్ కంటెంట్ తో సాగుతుందనీ, ఒకప్పటి కలకత్తా నగరాన్ని తలపించే నేపథ్యం అవసరమనీ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడం వీలుపడదు. కాబట్టి ఆ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ హైదరాబాదులో భారీ సెట్స్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కలకత్తా సెట్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ వుంటుంది. ఇక ఇది నాని నటించే 27 వ చిత్రం అవుతుంది. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్నాడు.
Tags:    
  • Shyam Singha Roy 
  • nani 
  • sai pallavi 
  • rahul 

Similar News

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

Copyright @2026

Powered by Blink CMS