శ్యామ్ సింగరాయ్‌.. ఓ పురాత‌న కోట క‌హానీ?!

Update: 2020-09-28 06:00 GMT
నేచుర‌ల్ స్టార్ నాని మ‌ళ్లీ స్పీడు పెంచారు. ఇటీవ‌ల యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `వి`తో ఆడియ‌న్స్ ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. కెరీర్ ల్యాండ్ మార్క్  25వ‌ చిత్రంగా హ‌డావిడి చేసినా `వి` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ టేకింగ్‌.. దిల్ రాజు మేకింగ్ ఈ చిత్రాన్ని ఆ లెవల్లో నిల‌బెట్ట‌లేక‌పోయాయి. దీంతో ఈ మూవీ డిజిట‌ల్ నిరాద‌ర‌ణ‌తో దారుణ ఫ‌లితాన్ని చూడాల్సి వ‌చ్చింది.

ఫ‌లితం ఎలా ఉన్నా త‌దుప‌రి చిత్రాన్ని మొద‌లుపెట్టాలి కాబ‌ట్టి నాని ఆ ప‌నిలో బిజీ అయిపోయాడు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. పిరియాడిక్ ట‌చ్ వున్న ఈ మూవీని `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ రూపొందించ‌బోతున్నాడు. నానికి జోడీగా ఇందులో ఇంకా ఎవ‌రినీ సెలెక్ట్ చేయ‌లేదు. సాయి ప‌ల్ల‌వి న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సితార ఎంట‌ర్ టైన్ ‌మెంట్స్ బ్యాన‌ర్ ‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌వంబ‌ర్ నుంచి ఈ మూవీ సెట్స్ ‌పైకి రాబోతోందని తెలిసింది. కొంత భాగం పురాత‌న కోట నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ట‌. మూవీ నేప‌థ్యంలో.. నాని క్యారెక్ట‌ర్ ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్స్ గా నిలుస్తాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర మేక‌ర్స్ త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నార‌ట‌.
Tags:    

Similar News