• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దూకుడు పెంచిన 'శ్యామ్...

దూకుడు పెంచిన 'శ్యామ్ సింగ రాయ్'

By - Tupaki Desk
Update: 2021-11-18 03:04 GMT
మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ .. నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే ఈ సారి ఆయన మరింత కొత్తదనంతో 'శ్యామ్ సింగ రాయ్'గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. మొదటిసారిగా ఆయన చారిత్రక నేపథ్యంతో కూడిన కథలో చేశాడు. ఇంతవరకూ కనిపిస్తూ వచ్చిన దానికి పూర్తి భిన్నంగా కనిపించనున్నాడు. అంతేకాదు ముగ్గురు కథానాయికలతో తెరపై ఆయన జెర్నీ కొనసాగుతుంది.

ఇలా 'శ్యామ్ సింగ రాయ్' ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుని కనిపిస్తోంది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు.

ఆయా సందర్భాల్లో నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా అలరించనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రచారాలు అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. అందువలన ఇక ప్రమోషన్స్ పరంగా వేగాన్ని పెంచుతూ వెళుతున్నారు.

నాని ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడనే అంశం మరింత ఆసక్తికరంగా మారింది. సాధారణంగా నాని సినిమాలు .. కాలనీ చెప్పే కథల్లా సాగిపోతుంటాయి. అలాంటిది ఈ సినిమా కోసం పది ఎకరాల్లో భారీ సెట్ వేసి మరీ చిత్రీకరించారు.

ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. తమిళంలో శివ కార్తికేయన్ .. మలయాళంలో నజ్రియా .. కన్నడలో రక్షిత్ శెట్టి టీజర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ విధంగా చేయడం కూడా ఈ సినిమా ప్రత్యేకతగానే చెప్పుకోవాలి.

టైటిల్ దగ్గర నుంచి .. నాని లుక్ దగ్గర నుంచి ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని నాని చెప్పడంతో, అందరూ మరింత ఆత్రుతతో ఉన్నారు. ఇక సాయిపల్లవికి .. కృతి శెట్టికి గల క్రేజ్ ఈ సినిమాకి కలిసిరానుంది.

ఇటీవల నాని నుంచి వచ్చిన 'టక్ జగదీష్' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. మరి నాని ఆశిస్తున్నట్టుగా 'శ్యామ్ సింగ రాయ్' ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి.



Tags:    
  • Shyam Singh Roy 
  • Nani 
  • Tollywood news 
  • movie gossips 
  • movie updates 
  • upcoming movies 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS