• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ తో 'శ్యామ్...

పవన్ కళ్యాణ్ తో 'శ్యామ్ సింగరాయ్ 2'..!

By - Tupaki Desk
Update: 2021-12-24 06:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కోరుకుంటారు. ఇప్పుడు పవన్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ వరుస సినిమాలు చేస్తుండటంతో.. చాలామంది డైరెక్టర్స్ అలాంటి అరుదైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కూడా వచ్చి చేరాడు.

'టాక్సీవాలా' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్ సాంకృత్యన్.. ఇప్పుడు ''శ్యామ్ సింగ రాయ్'' చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామాని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా రాహుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ తో సినిమా చేయాలనే కోరిక వెలిబుచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరోలతో ఎలాంటి సినిమాలు తను ఎలాంటి సినిమాలు తీయాలని అనుకుంటున్నాడో చెబుతూ వచ్చిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్.. పవన్ కళ్యాణ్ తో 'శ్యామ్ సింగరాయ్' లాంటి సబ్జెక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని అన్నారు. పవన్ అంటే ఓ ఫైర్ అని.. 'శ్యామ్ సింగ రాయ్' మాదిరిగానే ఫైర్‌ తో కనిపిస్తారని అభిప్రాయపడ్డారు.

పవన్ కు అలాంటి ఫైర్ ఉన్న సబ్జెక్ట్ పడితే ఆయనకున్న స్ట్రేంత్ కు వేరే లెవల్ లో ఉంటుంది.. ఆయనకున్న ఫ్యాన్ బేస్ కి థియేటర్ పగిలిపోద్దని రాహుల్ సంకృత్యాన్ అన్నారు. ఒకవేళ 'శ్యామ్ సింగ రాయ్' పార్ట్-2 తీస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారితో చేస్తానని యువ దర్శకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవలే 'ప్రస్థానం' దేవా కట్టా సైతం 'రిపబ్లిక్' సీక్వెల్‌ ను పవన్ కళ్యాణ్‌ తో చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు అవకాశం వస్తే పవన్ తో 'శ్యామ్ సింగ రాయ్ 2' చేస్తానని అని రాహుల్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి టాలెంటెడ్ డైరెక్టర్ కోరిక త్వరలోనే నిజమవుతుందేమో చూడాలి.

కాగా, రాహుల్ సంకృత్యాన్ 'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని వైవిధ్యమైన కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు. దీనికి సత్యదేవ్ జంగా కథ అందించారు. ఇందులో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారు. సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ లో వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ శుక్రవారం అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
Tags:    
  • Pawan Kalyan 
  • Shyam Singa Roy 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS