• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒక్క క్రికెటర్‌.. బాబోయ్‌...

ఒక్క క్రికెటర్‌.. బాబోయ్‌ ఇన్ని అఫైర్స్‌!

By - Tupaki Desk
Update: 2023-01-21 00:30 GMT
టీం ఇండియా క్రికెటర్స్‌ మరియు సినీ హీరోయిన్స్‌ ప్రేమలో పడటం కొత్తేం కాదు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రేమ వ్యవహారాల గురించి మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. క్రికెటర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న వెంటనే బాలీవుడ్‌ ముద్దుగుమ్మలతో ప్రేమలో పడటం మన క్రికెటర్స్ కు అలవాటుగా మారింది.

ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ కూడా హీరోయిన్ అనుష్క ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్స్ ను కాకున్నా మోడల్స్ మరియు ఇండస్ట్రీకి ఏదో ఒక రకంగా సంబంధం ఉన్న వారిని టీం ఇండియా క్రికెటర్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

ప్రస్తుతం యువ క్రికెటర్‌ శుభ్‌మన్ గిల్‌ యొక్క ప్రేమ వ్యవహారాల గురించి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈయన డబుల్‌ సెంచరీ సాధించడంతో మరోసారి ప్రేమ విషయాల గురించి ప్రచారం జరుగుతోంది. అయితే ఈయన రెండు లవ్‌ స్టోరీలు నడుపుతున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మూడు సంవత్సరాల క్రితమే సచిన్ కూతురు సారా టెండూల్కర్‌ తో శుభ్‌ మన్ గిల్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ విషయం నిజమే అన్నట్లుగా ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు. ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఓకే చెప్పారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్య కాలంలో హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌ తో ఈ యువ క్రికెటర్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరమే వెళ్లిందని.. సచిన్ కూతురుతో బ్రేకప్ అయిన వెంటనే సారా అలీ ఖాన్ తో ప్రేమలో పడ్డాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

గత కొంత కాలంగా పూర్తిగా క్రికెట్‌ పై దృష్టి పెట్టిన ఈ యువ క్రికెటర్‌ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించడం లేదు. దాంతో ప్రస్తుతం ఇతడు ఎవరి ప్రేమలో ఉన్నాడు.. ఎవరితో పెళ్లికి సిద్ధం అవ్వబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. మొత్తానికి ఒక్క క్రికెటర్‌ ఇన్ని అఫైర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • ShubhmanGill 
  • SaraTendulkar 
  • SaraAliKhan 
  • Cricketer 
  • Bollywood 
  • MovieNews 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS