ఒంటరిగా సక్సెస్ అయిన శృతి హాసన్
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతురు మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అనే విషయం తెల్సిందే. ఆమె నటన, సంగీతంతో పాటు పలు రంగాల్లో గుర్తింపు దక్కించుకుంటుంది. ఒక వైపు హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలోనే లండన్ ఇంకా పలు దేశాల్లో మ్యూజిక్ షోలు చేస్తూ అక్కడ గుర్తింపు దక్కించుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా వాటికే పరిమితం అవ్వాలనే ఉద్దేశ్యంతో శృతిహాసన్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొన్నటి వరకు శృతి హాసన్ తన ప్రియుడు మైఖేల్ కోర్సలేతో కలిసి స్టేజ్ షోలు ఇచ్చేది. ఇద్దరు కలిసి ఇచ్చిన షోలకు మంచి ఆధరణ దక్కింది.
ఇటీవల మైఖేల్ సోషల్ మీడియా ద్వారా శృతిహాసన్ కు బ్రేకప్ చెప్పినట్లుగా తెలియజేశాడు. ఇద్దరి దారులు వేరవ్వడం వల్ల తామిద్దరం విడిపోవాలని భావిస్తున్నట్లుగా అతడు చెప్పుకొచ్చాడు. మైఖేల్ ఆ పోస్ట్ తర్వాత శృతిహాసన్ ఒంటరిగా స్టేజ్ షో ఇవ్వడం జరిగింది. లండన్ లోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈమె ప్రదర్శణ ఇవ్వడం జరిగింది. ప్రియుడితో కాకుండా ఒంటరిగా ఆమె ఈ ప్రదర్శణ ఇచ్చి సక్సెస్ ను దక్కించుకుంది.
స్థానిక ప్రేక్షకులను తన పాటతో ఆకట్టుకోవడంతో పాటు, అందరి ప్రశంసలు దక్కించుకుంది. శృతిని అభినందిస్తూ స్థానిక మీడియాలో కథనాలు కూడా వచ్చాయట. స్టేజ్ షోలతో మరింత గుర్తింపు దక్కించుకోవాలనేది శృతి కోరిక. తనకు సంగీతం అంటే ప్రాణం అని, అందుకే తాను స్టేజ్ షోలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈమె సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. గతంలో విజయ్ సేతుపతితో కలిసి నటించేందుకు ఒక సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చింది. ఆ సినిమాను పూర్తి చేసే పనిలో ఉంది. మళ్లీ ఈమె సినిమాలో నటిస్తుందని భావిస్తున్నారు. అయితే శృతి హాసన్ కు మాత్రం ఆ ఆలోచన ఉన్నట్లుగా లేదు. తెలుగు, తమిళం, హిందీల్లో ఈమెకు మంచి ఆఫర్లు వస్తాయి, కాని సంగీతంపై ఆసక్తితో స్టేజ్ షోలకు ఆసక్తి చూపుతోంది.

For Video Click Here