• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేని బాయ్ ఫ్రెండ్ గురించి...

లేని బాయ్ ఫ్రెండ్ గురించి ఏం చెప్పాలి: స్టార్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2020-05-12 04:45 GMT
మాతృదినోత్స‌వం సంద‌ర్భంగా హీరోయిన్ శృతిహాసన్ అభిమానులతో ముచ్చటించింది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన శృతి ఎల్లపుడు సోషల్ మీడియాలో ఏదొక పోస్ట్ చేస్తూ త‌న అభిమానులకు చేరువవుతుంది. ఇక ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ‘సరదాగా ఏమైనా అడగమని అభిమానులను కోరింది. నెటిజన్లు, అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చాలా ఓపికతో స‌మాధానాలిచ్చింది. లాక్‌ డౌన్ త‌ర్వాత మొద‌ట చేసే ప‌ని ఏంటంటే.. షూటింగులకు వెళ్తానంటుంది. తండ్రి గురించి చెప్తూ.. త‌న తండ్రి, హీరో క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌స్తుతం చెన్నైలో బాగానే ఆరోగ్యంగా సేఫ్ గా ఉన్నార‌ని చెప్పింది. చివ‌రిగా మీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పండి.. అనే ప్ర‌శ్న‌కు అమ్మడు ‘సరే టాటా బైబై’ అంటూ జవాబు చెప్పకుండా వెళ్ళి పోయింది.

అస‌లు విష‌యం అడిగే స‌రికి శృతి నోరు మెదపకపోవడంతో నెటిజన్లలో ఇంకాస్త ఆసక్తి పెరిగింది. అయితే అసలు బాయ్ ప్రియుడి విషయంలో ఏం జరిగిందంటే.. గత కొన్నేళ్లుగా శృతి లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సేల్ తో ప్రేమాయణం సాగించింది. ఇరు కుటుంబాలకు వీరి ప్రేమ విషయం తెలుసు. కానీ ఈ జంట ప్రస్తుతం విడిపోయారని తెలుస్తుంది. తమ బ్రేకప్ విషయాన్నీ ఓసారి మైకేల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓపెన్ గా చెప్పేసాడు. ''జీవితం మా ఇద్దరినీ వేరువేరు మార్గాలలో నిలిపింది. విషయం ఏంటంటే.. ఇప్పుడు మేమిద్దరం ఎవరి మార్గంలో వారు నడవాల్సి ఉంది.

కానీ ఈ యంగ్ లేడీ మాత్రం ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ గానే మిగిలిపోతుంది. ఆమెకు జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను'' అంటూ.. శృతితో దిగిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. మూడేళ్ల క్రితం లండన్ వెళ్లినప్పుడు ఓ కన్సర్ట్ లో శృతి.. మైకేల్ ని కలిసింది. ఆ తరువాత ఇద్దరు స్నేహితులుగా మారడం, స్నేహం కాస్త ప్రేమగా మారడం జరిగాయి. చివరకు ఈ ప్రేమజంట స్నేహ పూర్వకంగానే విడిపోయారని సమాచారం. ఎలాగో లవ్ పోయింది కదా ఆ విషయం మళ్లీ గుర్తుచేసుకోవడం ఎందుకని భావించి శృతి అలా జారుకుందని అర్ధమవుతుంది. లేని బాయ్ ఫ్రెండ్ గురించి ఏం చెప్పమంటారు అనుకుందేమో భామ.. కాబోలు!
Tags:    
  • Shruti Haasan on breakup with Michael Corsale 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS