మహేష్ అందగాడైతే..

Update: 2015-08-01 04:24 GMT
తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ బాబు అందమైన నటుడు.. అందుకే బాలీవుడ్ వారు సైతం ముంబై ఎత్తుకెళిపోవాలని ఎత్తులు వేశారు. అంతటి మన సుందరాంగుడిని మహేష్ అందగాడైతే నాకేంటి...? అనేసింది ఓ సుందరి. ఎవరా సౌందర్యవతి ఆవేశంతో ఊగిపోయేరు..ఆ అమ్మడు మన శ్రీమంతుడి చారుశీల శృతి హాసన్.

అందగాడైన మహేష్ తో నటించేటపుడు మహేష్ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడని అనిపించిందా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది లోక నాయకుడి ముద్దుల తనయ. మహేష్ అందగాడైతే ఏంటి.. ఎవరి అందం వారికుంటుంది. అయినా ఇది అందాల పోటీ కాదు. సినిమా. అందంగా కనపడాలని ఎవరు అనుకోరు. అలా అయితే ప్రపంచంలో అందరికంటే అందంగా కనపడాలని నాకూ వుంది అంటూ విరుచుకుపడింది. మహేష్ తో నటించాలంటే నటనలోనే కాదు స్క్రీన్ పైన అందంగానూ కనపడాలి అని కొందరు సుందరాంగులు వయ్యారాలు పోతుంటారు. శృతి ఇలా అనేసరికి అక్కడి వారంతా అవాక్కాయిపోయారు. తండ్రి పోలికలు నటనకే పరిమితం కాలేదు అనిపిస్తుంది కదూ..! 
Tags:    

Similar News