ఫోటో స్టోరీ: సెక్సీ చీర కట్టిన చెల్లకుట్టి

Update: 2020-02-08 05:04 GMT
తెలుగు ప్రేక్షకులకే కాదు.. సౌత్ ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరమే లేని పేరు శ్రియ శరణ్. హిందీ సినిమాలు కూడా చేసి సిసలైన ప్యాన్ ఇండియన్  హీరోయిన్ అనిపించుకుంది. అయితే గత కొంతకాలంగా శ్రియ హవా తగ్గింది.  సీనియర్ హీరోయిన్ గా మారింది కాబట్టి క్రేజీ ఆఫర్లు లేవు.  పైగా రష్యన్ బాయ్ ఫ్రెండ్ ను మనువాడి శ్రీమతిగా మారిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా సినిమాల సంఖ్య తగ్గింది. అలా అని సోషల్ మీడియా ను టార్చర్ చెయ్యడం మాత్రం మానడం లేదు.

యమా జోరుగా ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.  నిజానికి శ్రియ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిండా అలాంటి ఫోటోలే.  ఇక రీసెంట్ గా తన హాటు సంప్రదాయం కొనసాగిస్తూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "పాయల్ సింఘాల్ గారు..ఈ అద్భుతమైన చీరకు కృతజ్ఞతలు.  సో ఈజీ.. చిల్.. ఎలిగెంట్' అంటూ క్యాప్షన్  ఇచ్చింది. ఫోటోలో లూజ్ గా ఉన్న బ్లౌజు.. వెరైటీగా ఉన్న చీర ధరించి వీలైనంత హాటుగా కనిపిస్తూ పోజులిచ్చింది. నిజానికి శ్రియ కు హాటు అఘోర అని పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే  చీర కొంగును ఒక దేశపు జెండాను ఎత్తినట్టు పైకెత్తి నాభి అందాల ప్రదర్శనకు నడుంకట్టి మరీ పోజిచ్చింది.  ఎవరో ట్వెంటీ ఇయర్స్ బ్యూటీ అలా ఫిట్ గా ఉంటే సాధారణ విషయమని సరిపెట్టుకోవచ్చు కానీ ఇలా ఫార్టీస్ కు దగ్గర లో ఉన్న భామ ఇలా చేయడం అఘోర లక్షణం కాక ఇంకేంటి?
Read more!

ఈ ఫోటోలకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "ఏజ్ లెస్ బ్యూటీ".. "చెల్లకుట్టి".. "సీనియర్ కానీ సూపర్ హాట్" అంటూ కామెంట్లు పెట్టారు.  అయినా ఈ కామెంట్ల వల్ల శ్రియకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఈ ఫోటోలను ఫిలిం మేకర్లు కనుక చూస్తే మాత్రం అమ్మడి బుట్టలో రెండు మూడు కొత్త అఫర్లు పడడం ఖాయం.  ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే తమిళ చిత్రం 'సండకారి'లో నటిస్తోంది. బాలకృష్ణ - బోయపాటి సినిమాలో ఒక కీలక పాత్రకు శ్రియను తీసుకున్నారని కూడా టాక్ ఉంది.
Tags:    

Similar News