శ్రియ .. అందానికి ఆనవాలు .. ఆకర్షణకి చేవ్రాలు. ఆమె వాలు కళ్లు .. సవాలు చూపులు కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
అజంతా శిల్పంలా .. అప్సరసలా ఆమె వెండితెరపై విరిసింది. సౌందర్య జలపాతమై పడుచు మనసులపై కురిసింది. 'ఇష్టం' అనే ఒక చిన్న సినిమాతో ఆమె ప్రయాణం మొదలైంది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమె కెరియర్ మంచి దూకుడుగా కొనసాగింది. వరుస అవకాశాలతో .. వరుస విజయలతో దూసుకుపోయింది. దాదాపు స్టార్ హీరోలందరినీ కవర్ చేసేసింది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
అలాంటి శ్రియ తన గ్లామర్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ, అప్పటి గ్లామర్ కి అతి దగ్గరలోనే కనిపిస్తోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గమనం' రెడీ అవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 20 ఏళ్లు గడిచిపోయాయా అనిపిస్తోంది. ఇంతకాలం పాటు నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నటిగా 20 ఏళ్ల నా ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశాను. వాటిలో కొన్ని వర్కౌట్ అయ్యాయి .. మరికొన్ని వర్కౌట్ కాలేదు. తెలుగు సినిమాకి నేను ఎప్పుడూ దూరం కాలేదు. నాకు వచ్చిన వాటిలో నచ్చిన పాత్రలను చేస్తూనే ఉన్నాను. ఆ మధ్య కరోనా సమయంలోనే అందరిలాగే నేను ఇంటిపట్టునే ఉండిపోవలసి వచ్చింది. కానీ ఆ గ్యాపులో నటనకి దూరంగా ఉండవలసి రావడమే నాకు చాలా కష్టంగా అనిపించింది. సినిమా వాతావరణానికి నేను ఎక్కువ కాలం దూరంగా ఉండలేను. ఈ విషయంలో ఏఎన్నార్ గారే నాకు ఆదర్శం.
ఒక నటుడిగా తన ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటానని ఏఎన్నార్ అనేవారు. అలానే ఆయన తన చివరి సమయం వరకూ నటిస్తూనే వచ్చారు. నటన పట్ల ఆయనకి గల ఇష్టానికీ .. అంకితభావానికి అది నిదర్శనం. అలానే నేను కూడా నా చివరి నిమిషం వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. మంచి అవకాశాలు వస్తున్నంత వరకూ చేస్తూనే ఉంటాను. మరో 20 ఏళ్లపాటు నటించాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చారు. 'గమనం' సినిమాలో తాను పోషించిన పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.