టెర్రాస్ మీద చెమ‌ట‌లు ప‌ట్టించిన క‌రోనా!

Update: 2020-03-24 15:30 GMT
క‌రోనా క‌రోనా క‌రోనా.. ఈ ప‌దం వింటేనే ప్ర‌పంచం మొత్తం ఒణికిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప‌ల్లెటూళ్ల‌లోనూ ముఖానికి మాస్కులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయంటే సీన్ ఏంటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక క‌రోనా గాలిలోనూ ఎక్కువ స‌మ‌యం బ‌తికి ఉంటుంద‌ని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌క‌టించ‌డంతో మ‌రింత‌గా చెమ‌ట‌ల‌తో త‌డిసిపోతోంది.

అయితే వైర‌స్ కి చెమ‌టే విరుగుడు.. అన్న చందంగా ఇదిగో ఈ అమ్మ‌డు ఇంటి టెర్రాస్ పైకి ఎక్కి చెమ‌ట‌లు ప‌ట్టించేస్తోంది. ఒంటికి కావాల్సినంత శారీర‌క శ్ర‌మ ఉంటే ఏ రోగం ఉండ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. స‌నాత‌న భార‌తీయ సాంప్ర‌దాయంలో ఇది ఆచ‌ర‌ణీయం. కానీ ఇటీవ‌ల బాగా తిని టీవీల ముందు రోజంతా కూచునే బ్యాచ్ కి ఇది అర్థం కావ‌డం లేదు. అందుకేనేమో ఈ భామ జిమ్ కి వెళ్ల‌క‌పోయినా ఇంట్లోనే ఇంత శ్ర‌ద్ధ‌గా వ్యాయామం చేస్తూ మీరూ ఇలా చేయండి అంటోంది.

ఇక దేశంలో కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్ర‌జ‌ల‌తో పాటు సెల‌బ్రిటీలంతా స్వీయ దిగ్బంధనంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ బాప‌తులో చురుగ్గా ఇలాంటి వాటిపై అవగాహన పెంచుకుని కేర్ తీసుకునే భామ‌గా శ్ర‌ద్దా పేరు మార్మోగుతోంది. ఇంట్లోనే ఉంటూ .. సామాజిక దూరాన్ని పాటించ‌డం .. త‌న‌ను తాను దిగ్భంధనం చేసుకోవ‌డం ప్ర‌తిదీ గ్రేట్ అనే చెప్పాలి.  శ్ర‌ద్ధా తాజా పోస్ట్ లతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అంద‌రినీ ప్రేరేపిస్తోంది. తాజా ఫోటోలో శ్ర‌ద్ధా చెమ‌ట‌లు ప‌ట్టి క‌నిపిస్తోంది.  టెర్రాస్ పై ఒక చాప మీద కూర్చుని కనిపించింది. 33 ఏళ్ల ఈ అందాల‌ నటి ఎరుపు రంగు టీ ష‌ర్ట్ ను ధ‌రించింది. ఇక శ్ర‌ద్ధా రేర్ నో మేకప్ లుక్ .. త‌న‌దైన‌ సహజ సౌందర్యం ఆక‌ర్షిస్తోంది.

కెరీర్ సంగ‌తులు చూస్తే.. శ్రద్ధా కపూర్ న‌టించిన రెండు భారీ చిత్రాలు ఇప్ప‌టికే రిలీజ‌య్యాయి. వరుణ్ ధావన్ తో క‌లిసి నటించిన స్ట్రీట్ డాన్సర్ 3D లో అదిరిపోయే డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో మైమ‌రిపించింది. అలాగే అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన బాఘీ 3లోనూ ఆడిపాడింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.


Tags:    

Similar News