ప్రభాస్ క్యారేజీ ముందు చిన్నబోదా..?
సాహో శ్రద్ధా కపూర్ .. తాను ఏం తింటోందో కానీ.. ఇదిగో ఇలా క్యారేజీని స్మార్ట్ గా ప్యాక్ చేయించుకుని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ఇది ఆన్ లొకేషన్ తినే తిండేనా? ఆ నాలుగు కప్పుల్లో దీదీ తనకు ఏం వండి వడ్డించిందో కానీ అభిమానులందరికీ తెగ నోరూరిపోతోంది.
సిద్ధాంత్ కపూర్ అయితే అసలు ఆ క్యారేజీలో ఏం ఉన్నా కానీ లొట్టలేసుకుని తినేస్తానని నాలుక చప్పరించేశాడు. మిస్ యు అండ్ యువర్ దీదీ ఫుడ్! .. మిస్ ఎనర్జీ! అంటూ మరో కోస్టార్ చాలా ఆవేదనను వ్యక్తం చేసింది.
ఇక ఆ క్యారేజీని చూడగానే డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఆసక్తికర కామెంట్లతో ఫన్ ని క్రియేట్ చేశారు. అప్పట్లో శ్రద్ధ కోసం సాహో సెట్స్ కి ప్రభాస్ ఇంటి నుంచి ఒక బిగ్ ఫ్యాట్ క్యారేజీ వెళ్లేది. ప్రభాస్ స్వయంగా దానిని దగ్గరుండి తినిపించేవారని కూడా టాక్ వినిపించింది. ఆ క్యారేజీ తిన్న తర్వాత ఇక జీవితంలో ఇంకేదీ వినిపించదు కనిపించదు అని కూడా శ్రద్ధా ఎంతో సంబరంగా చెప్పుకొచ్చిన సంగతిని డార్లింగ్ అభిమానులు మరువనేలేదు. అందుకే ఇప్పుడు ఈ బుల్లి క్యారేజీ తినే శ్రద్ధాకి ప్రభాస్ ఫ్యాటీ క్యారేజీ ఏ రేంజులో సర్ ప్రైజ్ చేసి ఉంటుందో ఊహించేస్తున్నారు అభిమానులు. శ్రద్ధా కెరీర్ మ్యాటర్ కి వస్తే... గత కొంతకాలంగా ఎందుకనో స్తబ్ధుగా ఉంటోంది. తొందర్లోనే ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠను మనువాడనుందని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.