వెర్రెత్తిస్తున్న శ్ర‌ద్ధా రెడ్ హాట్ వెల్వెట్ బికినీ

Update: 2021-03-17 08:30 GMT
ఆషిఖి 2 చిత్రంలో గాయ‌నిగా ప్రేమికురాలిగా అద్భుతంగా న‌టించి గొప్ప ఫాలోయింగ్ ని తెచ్చుకున్న శ్ర‌ద్ధా క‌పూర్ .. సాహో చిత్రంతో డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానుల‌కు క‌నెక్ట‌యిపోయింది. బాలీవుడ్ లో ఉన్న అతికొద్ది మంది ప్ర‌తిభావ‌నుల్లో శ్ర‌ద్ధా ఎప్పుడూ టాప్ స్లాట్ లో ఉంది.ఈ భామ తొంద‌ర్లోనే రోహ‌న్ శ్రేష్ఠ అనే స్నేహితుడిని పెళ్లాడ‌నుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. కానీ దానికి అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. ఇక శ్ర‌ద్ధా నిరంత‌ర ఫోటోషూట్లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తాజాగా రూబీ వెల్వెట్ కటౌట్ బికినీలో క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేసింది. ఇది మార్చి 3న త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ధ‌రించిన వెల్వెట్ డ్రెస్. దీని విలువ రూ.25000.  మాల్దీవుల్లో తన పుట్టినరోజు వేడుకల్లో ధ‌రించిన ఈ డ్రెస్ ని శివన్ - నరేష్ రూపొందించారు. ఇది ఇంటర్ లేస్డ్ కటౌట్ బికినీ. యువ‌త‌రంలో ఎంతో క్రేజు ఉన్న డ్రెస్ ఇది.

ఈ చిత్రాన్ని తొలిగా శ్ర‌ద్ధా స్టైలిస్ట్ నమ్రతా దీపక్ మొదట ఇన్ స్టాగ్రామ్ ‌లో పంచుకున్నారు. అనంత‌రం శ్రద్ధా బీచ్ లుక్  విజువల్స్ ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‌లలో అభిమానుల క్లబ్ లు విస్తృతంగా పంచుకున్నాయి. శివన్ -నరేష్ రూబీ ఎరుపు రంగు దుస్తులను రూపొందించిన తీరుపైనా ప్ర‌శంస‌లు కురిశాయి. ఫోటోలో శ్రద్ధా తన సైడ్ ప్రొఫైల్ ను చూపిస్తూ ముగ్ధ మ‌నోహ‌రంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News