శ్ర‌ద్ధా.. ల‌వ్ మ్యాట‌ర్ పై ఏదైనా హింట్ ఇస్తోందా?

Update: 2021-03-04 05:30 GMT
సాహో ఫేం శ్ర‌ద్ధా కపూర్ ప్రేమాయ‌ణాల గురించి ఇటీవ‌ల హాట్ డిబేట్ ర‌న్ అవుతోంది. గ‌త కొంత‌కాలంగా ఫోటోగ్రాఫ‌ర్ రోహ‌న్ శ్రేష్ఠ‌ను శ్ర‌ద్ధా పెళ్లాడేయ‌బోతోందంటూ ముంబై స‌ర్కిల్స్ లో ప్ర‌చారం సాగుతోంది. ఈ జంట ఇప్ప‌టికే ప‌లుమార్లు కెమెరా ముందు అధికారికంగానే జంట‌గా ఫోజులివ్వ‌డంతో ఇక పెళ్లికి ముహూర్తం ఫిక్స‌యిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.

ఈ ఏడాది ద్వితీయార్థంలో శ్ర‌ద్ధా - రోహ‌న్ పెళ్లి ఉంటుంద‌న్న ప్ర‌చారం కూడా సాగిపోతోంది. ఇంత‌కుముందు రోహ‌న్ తో క‌లిసి శ్ర‌ద్ధా ఓ పెళ్లికి వెళ్లి కెమెరాల‌కు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.  తాజాగా శ్ర‌ద్ధా ఓ ఆస‌క్తిక‌ర ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో శ్ర‌ద్ధా ఏదో ఘాడ‌మైన మెసేజ్ ని ఇస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ఒంట‌రిగా బీచ్ లో అనాలోచితంగా క‌నిపిస్తోంది. టూపీస్ లో స‌ముద్రంలో జ‌ల‌కాలాట‌కు ప్రిపేర‌య్యే ముందు సాయం సూర్యుడిని త‌థేకంగా చూస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. బ్లూ సీ మీదుగా సూర్యాస్త‌మ‌యానికి సంబంధించిన లుక్ అది. ఇక ఈ ఫోటోకి ``గ్రేట్ ఫుల్ ఫ‌ర్ ఆల్ యువ‌ర్ ల‌వ్ అండ్ విషెస్..``అంటూ క్యాప్ష‌న్ ని యాడ్ చేసింది. చూస్తుంటే త‌న జీవితంలో మ‌రో కొత్త అంకం మొద‌లు కాబోతోంద‌ని... త‌న‌ని గొప్ప‌గా ప్రేమించే యువ‌కుడు దొరికాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే శ్ర‌ద్ధా ఎందుక‌నో ఇటీవ‌ల స్లో అయ్యింది. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండే స‌త్తా ఉన్నా ఆచి తూచి అడుగులేస్తోంది.
Tags:    

Similar News