ఫోటో స్టొరీ: ఆ హాటు బాంబుల బ్యాచ్ కాదు!

Update: 2019-09-07 04:47 GMT
బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు.  బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 9 ఏళ్ళు అయింది.  రీసెంట్ గా 'సాహో' తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. గ్లామర్ విషయంలో కత్రినా.. కియారా రేంజ్ కాదు కానీ నటన విషయంలో అసలు వంక పెట్టలేం.  హాట్ గా ఉంటుంది కానీ మరీ దిశా పటాని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి హాటు బాంబుల బ్యాచ్ కాదు. అయితే స్టైల్ విషయంలో మాత్రం అదరగొడుతూ ఉంటుంది.  రీసెంట్ గా రిలీజ్ అయిన తన కొత్త సినిమా 'చిచోరే' ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది శ్రద్ధ.

'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించాడు. మన తెలుగు తేజం నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించడం విశేషం.  ఈ సినిమా సెప్టెంబర్ 6 న ప్రేక్షకులముందుకు వచ్చింది.  దీంతో 'చిచోరే' టీమ్ థియేటర్ల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రద్ధా కూడా 'చిచోరే' టీమ్ మెంబర్స్ తో కలిసి ముంబై నగరంలోని థియేటర్లకు వెళ్లి అక్కడ ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకుంటోంది.  వారితో ముచ్చట్లు చెప్తోంది.  ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వైట్ కలర్ క్రాప్ టాప్ - గ్రే కలర్ స్కర్ట్ ధరించి సింపుల్ గా బయటకు వచ్చింది. ఎంతో గ్రేస్ ఫుల్ గా కనిపిస్తోంది.  ముంబైలో వానలు ఫుల్లుగా ఉన్నాయట. అయినా ఆ వానలను ఏమాత్రం లెక్కచేయకుండా థియేటర్ల సందర్శన చేపట్టిందని బాలీవుడ్ మీడియా పొగడ్తలు కురిపిస్తోంది(కార్లోనే కదా ప్రయాణం.. శ్రద్ధ తడవదు కదా.. అనే చచ్చుపుచ్చు అనుమానాలను మొగ్గలోనే తుంచేయండి!).

ఇక 'చిచోరే' సినిమా విషయానికి వస్తే దాదాపు అన్నీ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సినిమాలో అక్కడక్కడ కొన్ని డల్ మొమెంట్స్ ఉన్నా ఓవరాల్ గా సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది.  ముఖ్యంగా కాలేజీ అల్లరి సీన్లలో.. జోకులతో తెగ హంగామా చేశారట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు.  సో.. శ్రద్ధ బుట్టలో హిట్ పడినట్టే.  ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే వరుణ్ ధావన్ తో 'స్ట్రీట్ డ్యాన్సర్ 3' లో హీరోయిన్ గా నటిస్తోంది.



Tags:    

Similar News