కండ‌ల హీరోని కాపీ కొట్టిన కొంటె భామ‌

Update: 2021-09-27 02:30 GMT
సింప్లిసిటీ అనేది మాట‌ల్లోనే కాదు..  చేత‌ల్లో కూడా చూపిస్తామ‌ని నిరూపించిన న‌టుడు హృతిక్ రోష‌న్. బాలీవుడ్ లో అత‌నో పెద్ద స్టార్. కోట్లాది రూపాయ‌లు పారితోషికం తీసుకుంటారు. అత‌ని తండ్రి పెద్ద ద‌ర్శ‌క‌ నిర్మాత‌. హృతిక్ వేల కోట్ల ఎస్టేట్ ల‌కు అధిప‌తి. కానీ హృతిక్ సింప్లిసిటీనే ఇష్ట‌ప‌డ‌తారు. ఇటీవ‌ల ఆ విష‌యాన్ని మ‌రోసారి  బ‌హిర్గ‌తం చేసారు. ఓ కామ‌న్ మ్యాన్ లా ఇప్పుడు అత‌డు అద్దె ఇంట్లో నివ‌శిస్తున్నాడు. ఆ ఇంటి గోడ‌ల‌కు ప‌గుళ్లు క‌నిపించాయి. ఇక తాజాగా ముంబైలో ఆటోలో తిరిగి త‌న నిరాడంబ‌ర‌త‌ను చాటి చెప్పారు. బంగ్లా లోఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్లు ఉన్నా..ఆటోలో ముంబై వీధుల్ని ఆస్వాధించ‌డం ఎంతో బాగుంద‌న్నారు.

ఆటోలో ఫ్రీ ఎయిర్..ప్ర‌తీ లోకేష‌న్ ని లైవ్ లో చూడొచ్చు..అదే కార్లు అయితే కంటికి  అద్దాలు అడ్డొస్తాయ‌ని త‌న విన‌మ్ర‌త‌ను చాటుకున్నారు. ముసుగు ధ‌రించి హృతిక్ ఇలా త‌న ఆటోజ‌ర్నీని ఎంజాయ్ చేసారు. తాజాగా అదే త‌ర‌హా మూవ్ మెంట్స్ ని బాలీవుడ్ న‌టి శ్ర‌ద్దాక‌పూర్ కూడా ఆస్వాదించింది. బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అయినా శ్ర‌ద్ద సాధార‌ణ అమ్మాయిలో ఆటోలో కావాల‌నే  ప్ర‌యాణం చేసిందిట‌. దీనికి సంబంధించిన ఓ వీడియోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. ఓ పెద్ద  సెల‌బ్రిటీ అయి ఉండి ఇలా సింపుల్ గా ఆటోలో తిర‌గ‌డం గొప్ప విష‌యం అంటూ నెటిజ‌నులు శ్ర‌ద్ధాని ఆకాశానికెత్తేస్తున్నారు.

ఓ అభిమాని అయితే కొంటె కామెంట్ తో ఆక‌ట్టుకున్నాడు. నేను కూడా అదే ఆటోలో ఆమె ప‌క్క‌న ఉంటే  ఎంత బాగుండేది? అని ఆశ‌ప‌డ్డాడు. కానీ ఆ ఛాన్స్ శ్ర‌ద్ధా ఇస్తుందా! సింగిల్ గానే త‌న ఆటో జ‌ర్నీని కొన‌సాగించింది. ఇక  పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన `సాహో` చిత్రంతో శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన సాహో వాటిని రీచ్ కాలేక‌పోయింది. ఆ త‌ర్వాత‌ శ్ర‌ద్దా క‌పూర్ టాలీవుడ్ ని విడిచి హిందీకే ప‌రిమిత‌మైంది. అయితే హిందీ చిత్ర సీమ‌లో అమ్మ‌డు బిజీ న‌టి అన్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ఆలియా భ‌ట్ కూడా ఇలా ఆటో షికార్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే.


Full View
Tags:    

Similar News