అడ్డుగోడ‌లను బ‌ద్ధ‌లు కొట్టండి.. యాసిడ్ దాడి బాధితుల‌పై ల‌ఘు చిత్రం!

Update: 2021-09-30 06:36 GMT
వ‌రుస హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు.. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ న‌టిగా సినిమా సినిమాకు మ‌రో మెట్టు ఎక్కుతూ ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది తాప్సీ. `ర‌ష్మీ రాకెట్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న తాప్సీ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ ని సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా విడుద‌ల చేసింది. మిల‌నో ఫ్యాష‌న్ వీక్ లో `వ‌ల్న‌రబుల్ : స్కేరీ ద‌ట్ యు డోంట్ సీ` అనే పేరుతో ఈ షార్ట్ ఫిల్మ్ ని ష‌బీనా ఖాన్‌.. కుల్సుమ్ షాదాబ్ నిర్మించారు.

యాసిడ్ దాడికి గురై అంద‌వికారంగా మారిన కొంత మంది అతివ‌ల వ్య‌ధ‌ల‌ని చూపిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ ని రూపొందించారు. ప‌ర‌దాల వంటి అడ్డుగోడ‌ల మ‌ధ్య నిత్యం కుమిలిపోతున్న ఎంతో మంది యాసిడ్ దాడి బాదితులు ఆ ప‌ర‌దాల్ని .. అడ్డ‌గోడ‌ల్ని బ‌ద్ద‌లు కొట్టి స‌మాజంలోకి రావాల‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌పంచ షార్ట్ ఫిల్మ్ ప్రీమియ‌ర్ తో భార‌త్ గ‌ర్వ‌ప‌డేలా చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ని తాజాగా తాప్సీ ఇన్‌స్టా వేదిక‌గా విడుద‌ల చేసింది. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మిల‌న్ లో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ ల‌ఘు చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డం ఖాయం. కొత్త స్వేచ్ఛా యుగంలో మేము రూపొందించిన ఈ ల‌ఘు చిత్రం ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుని ఆలోచింప‌జేస్తుంద‌ని భావిస్తున్నామ‌ని నిర్మాత ష‌బినా ఖాన్ తెలిపింది. ఈ ల‌ఘు చిత్రాన్ని అర్స‌లా ఖురేషీ..జాస్ సాగు సంయుక్తంగా రూపొందించారు.


Tags:    

Similar News