మెగా డాటర్ నిర్మించిన 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' టీజర్..!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా తన తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన సుష్మిత తొలి ప్రయత్నంగా ''షూట్-అవుట్ ఎట్ ఆలేరు'' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నిర్మించింది. 2015లో సంచలనం సృష్టించిన ఆలేరు ఎన్‌కౌంటర్ కేస్ ఫైల్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి 'ఓయ్' ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని టీజర్ ని విడుదల చేయడంతో పాటు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' టీజర్ లో హైదరాబాద్ లో అల్లర్లు.. పోలీసులు - నేరస్తుల మధ్య ఘర్షణలను చూపించారు. ఈ యాక్షన్ టీజర్ లో ఎక్కువగా ఏమి రివీల్ చేయనప్పటికీ సస్పెన్స్ కి గురిచేసే అనేక అంశాలు.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు అర్థం అవుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - సీనియర్ హీరో శ్రీకాంత్ లు పోలీసు ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తున్నారు. హీరోయిన్ నందినీ రాయ్ ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో వస్తున్న ఈ క్రైమ్ డ్రామా సిరీస్ 8 ఎపిసోడ్స్ గా ప్రసారం కానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' స్ట్రీమింగ్ కానుంది.
Full View