స్టార్ హీరొయిన్ కు షాక్ ట్రీట్ మెంట్

Update: 2018-12-24 08:26 GMT
సినిమా పరిశ్రమలో ఓ రేంజ్ కు చేరుకున్నాక తక్కువో ఎక్కువో ఎంతో కొంత మోతాదులో ఈగో ఉండటం సహజం. అది కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. కొన్నిసార్లు లోలోపలే దగ్గరివాళ్ళ కు మాత్రమే కనిపించేలా వ్యవహారం సాగిపోతుంది. కాని మనకు తెలియకుండానే ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు మానసికంగా ఇబ్బంది పెడతాయి. ఇదీ అలాంటి సంఘటనే. తనో స్టార్ హీరొయిన్. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి చిన్న హీరోతో స్టార్ట్ అయ్యి అనక స్టార్లతో హిట్లు కొట్టి తక్కువ టైంలో పెద్ద రేంజ్ కు చేరుకుంది. కాని గ్లామర్ విషయంలో కాస్త పట్టుదలకు పోవడంతో ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే 2018లో ఈ భామకు తెలుగులో ఒక్క సినిమా లేదు. సరే ఇవన్ని పరిశ్రమలో సహజం కదా అని సర్దుకుని పోయింది. ఇటీవలే ఓ ఆడియో వేడుకలో తనకు జరిగిన ట్రీట్మెంట్ పట్ల తెగ బాధ పడుతోందని సమాచారం. సదరు ఈవెంట్ లో ఈ హీరొయిన్ ని అతిదుల్లో ఒకరిగా పిలిచారు. తను వచ్చింది. అయితే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్ లో సెలెబ్రిటీలు కూర్చునే ముందు వరసలో కాకుండా తనకు సెకండ్ రోలో కుర్చీ కేటాయించడంతో కాస్త గిల్టీగా ఫీలయ్యిందట. ఇదో ఎత్తు అనుకుంటే వచ్చాక కూడా నిర్వాహకుల తరఫున తనకు స్వాగతం చెప్పేందుకు ఎవరూ లేదు.

అసిస్టెంట్ సహయంతో తన చైర్ ఎక్కడుందో తనే వెతుక్కోవాల్సి రావడం మంటల్లో నెయ్యి పోసినట్టు అయ్యింది. దీని గురించి తన సన్నిహితుల దగ్గర వాపోయిందట. అయితే నిర్వాహకులు నుంచి వినిపిస్తున్న వెర్షన్ ప్రకారం అతిధుల సంఖ్య విపరీతంగా ఉండటంతో కేవలం సినిమా హీరోకు చెందిన కుటుంబ సభ్యులకు మాత్రమే ఫస్ట్ రో ఉంచామని సీనియర్ నిర్మాతలు సైతం వెనకే ఉండటాన్ని గుర్తించాలని చెబుతున్నారట. ఏదైతేనేం జరిగింది ఘోరం నేనేమి చేశాను పాపం అని పాడుకోవడం సదరు హీరొయిన్ వంతైంది.
Tags:    

Similar News