దిగ్గజ నిర్మాత ట్వీట్ పై కేటీఆర్ ఘాటు రిప్లై

Update: 2020-03-31 07:51 GMT
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వేళ వలస కార్మికుల కష్టాలు మామూలుగా లేవు. తాజాగా మీరట్ లో ఓ వలస కూలీ.. తన ఎనిమిది నెలల గర్భిణి భార్య తో కలిసి 100 కి.మీలు నడిచిన దైన్యం దేశవ్యాప్తంగా అందరినీ కంటతడి పెట్టించింది. వైరల్ అయ్యింది. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వలస కార్మికులూ తమ బిడ్డలేనని..వారిని కడుపున పెట్టుకుంటామని.. నెలకు రూ.500 నగదు.. 12 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రకటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. బాలీవుడు నటుడు సోనూసూద్ ట్వీట్ చేసి కేసీఆర్ ను ప్రశంసించారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

కేసీఆర్ ప్రకటనపై ప్రముఖ నిర్మాత, బాహుబలి క్రియేటర్ అయిన శోభు యార్లగడ్డ స్పందించారు. కేసీఆర్ కరోనాపై ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ మంచి చేస్తున్నారని.. కానీ జాతీయ మీడియా మాత్రం దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ను తన ట్వీట్ లో ట్యాగ్ చేశాడు నిర్మాత.

కాగా నిర్మాత శోభు ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఏదైనా జాతీయ మీడియా అయి ఉంటే అది ఢిల్లీ వరకే పరిమితం కావద్దు.. పరిధిని మించి చూసినప్పుడే అది జాతీయ మీడియా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఇక నెటిజన్లు కూడా జాతీయ మీడియా కేసీఆర్ వార్తలు కవర్ చేయక పోవడంపై ప్రశ్నిస్తున్నారు. కాబోయే ప్రధాని కేసీఆర్ అని.. అందుకే ఆయన వార్తలు కవర్ చేయడం లేదని నెటిజన్లు మండిపడ్డారు.
Tags:    

Similar News