ప్రభాస్ ని ఇరకాటంలో పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్...!

Update: 2020-04-24 01:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండింగ్ లో ఉంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల వరకూ వెళ్ళింది. ఉత్త‌మ పురుషులెవ‌రూ ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇలాంటి క్వారంటైన్ టైమ్‌ లో ప‌నిచేయించ‌రంటూ ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ ను ముందుకు తీసుకెళ్తున్నారు. సందీప్ రెడ్డి వంగా మొదట ఈ ఛాలెంజ్ ను దర్శకుడు రాజమౌళి కి విసరగా.. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించి తన ఇంటిని శుభ్రం చేసి ఆ ఛాలెంజ్ ను కాస్తా ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ లకు - కీరవాణి, -సుకుమార్ - శోభు యార్లగడ్డలకు విసిరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ - రామ్ చరణ్ - కీరవాణి తమ టాస్కులను కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు తాజాగా జక్కన్న విసిరిన ఛాలెంజ్ ని నిర్మాత శోభు యార్లగడ్డ పూర్తి చేసాడు.

ఇంటి పనులన్నీ చేస్తూ వీడియో తీసి ఇదిగో రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో వదిలాడు. అంతేకాకుండా ఈ ఛాలెంజ్ ని స్వీకరించవలసిందిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అడవి శేష్.. అల్లు అర్జున్ లను నామినేట్ చేసాడు శోభు. ఇన్ని రోజులు యంగ్ రెబల్ స్టార్ ని ఎవరు నామినేట్ చేస్తారని ఎదురు చూసిన అభిమానులకు ఫైనల్ గా శోభు ఛాలెంజ్ చేసాడు. అయితే ప్రభాస్ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండకపోవడమే. ప్రభాస్ అసలు సోషల్ మీడియా ఫాలో అవడనేది ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం. అంతేకాకుండా ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ ఇంతవరకు ట్విట్టర్ లో అసలు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎప్పుడో ఒకటో రెండో పోస్టులు పెడుతుంటాడు. కరోనా నేపథ్యంలో విరాళం ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. టాప్ స్టార్స్ అందరు కరోనా గురించి తరచూ ఏదో ఒక విషయాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రజలకి చేరవేస్తుంటే ప్రభాస్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. లాక్ డౌన్ లో అందరూ హీరోలు తమ ఫ్యాన్స్ కి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటుంటే ప్రభాస్ మాత్రం అసలు టచ్ లో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి రియల్ మ్యాన్ ఛాలెంజ్ యంగ్ రెబల్ స్టార్ కేర్ చేయడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్స్ ట్విట్టర్లో యాక్టీవ్ గా ఉంటూ ఈ ఛాలెంజ్ వీడియోలను పోస్ట్ చేస్తుంటే ఇప్పటి వరకు ట్విట్టర్లో అడుగుపెట్టని ప్రభాస్ ఛాలెంజ్ వీడియో ఎక్కడ పోస్ట్ చేస్తాడులే అని పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి దాకా అందరు హీరోలు తమ భార్యలకు సపర్యలు చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభాస్ కి ఇంకా పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని తన తల్లికి సేవలు చేస్తాడేమో చూడాలి. ఏదేమైనా ఇన్ని రోజులు ఆఫ్ స్క్రీన్ మీద రెబల్ స్టార్ యాక్షన్ చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లో ఇంటి పనులు చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పరిస్థితులలో శోభు యార్లగడ్డ విసిరిన 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ ని పూర్తి చేసి ప్రభాస్ 'రియల్ మ్యాన్' అనిపించుకుంటాడో లేదో అనేది చూడాలి.
Tags:    

Similar News