రాజాసాబ్ ఎఫెక్ట్.. పీపుల్ మీడియా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ మూవీ.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ మూవీ.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా.. అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మేకర్స్ కు నష్టాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది.
అయితే రాజా సాబ్ ఎఫెక్ట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫ్యూచర్ ప్లాన్ పై పడిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. వరుస సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న ఆ బ్యానర్.. ఇప్పుడు రాజా సాబ్ రిజల్ట్ తో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు 50కి పైగా చిత్రాలను నిర్మించిన ఆ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు ప్రాజెక్టుల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తోందట.
అంతే కాదు.. ఇప్పటికే ప్లాన్ చేసిన కొన్ని సినిమాలను హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణాలుగా.. భారీ బడ్జెట్లు, పెరిగిన ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు, ఆడియన్స్ జడ్జిమెంట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇప్పటికిప్పుడే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అనేక మార్పులు తీసుకురావడంపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దృష్టి పెట్టిందని సమాచారం. స్క్రిప్ట్ సెలెక్షన్ నుంచి బడ్జెట్ కంట్రోల్ వరకు ప్రతి స్టేజ్ లో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని డిసైడ్ అయిందని వినికిడి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్న ప్రాసెస్ ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకుందట.
దీంతో కొన్ని రోజుల వరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి కొత్త మూవీ అనౌన్స్మెంట్లు తక్కువే వస్తాయేమో. అయితే ఇప్పటికే పూర్తైన కొన్ని సినిమాలను మాత్రం రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గూఢచారి 2, గరివిడి లక్ష్మి వంటి చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయట. ఆ సినిమాల కంటెంట్ పై మంచి నమ్మకం ఉన్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా పవన్ ను విశ్వప్రసాద్ కలిశారు కూడా. దీంతో ఆ ప్రాజెక్ట్ సెట్ అయితే బ్యానర్ కు మంచి ఊపు వస్తుంది. అంతే కాదు గూఢచారి 2 వంటి సినిమాలు హిట్ అయితే సక్సెస్ ట్రాక్ ఎక్కుతుంది. మొత్తానికి రాజా సాబ్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. క్వాలిటీ పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. మరి ఆ బ్యానర్ నుంచి రానున్న అప్ కమింగ్ చిత్రాలు ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాయో వేచి చూడాలి.