'గ‌మ‌నం' నుంచి శివ కందుకూరి - ప్రియాంక జవాల్కర్ ఫస్ట్ లుక్...!

Update: 2020-10-05 04:45 GMT
సుజ‌నా రావు దర్శకత్వంలో ''గ‌మ‌నం'' అనే పాన్ ఇండియా ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ రియ‌ల్ లైఫ్ డ్రామాలో సీనియర్ హీరోయిన్ శ్రియా శ‌ర‌ణ్ - నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన శ్రీయా - నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించింది. డీ గ్లామరస్ రోల్ లో శ్రియా లుక్ అందరిని ఆశ్చర్యపరిచింది. శాస్త్రీయ సంగీత గాయని శైలాపుత్రి దేవిగా నిత్య లుక్ కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న శివ కందుకూరి - ప్రియాంక జవాల్కర్ ల ఫస్ట్ లుక్ చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'గ‌మ‌నం'లో శివ కందుకూరి 'అలీ' పాత్రలో కనిపిస్తుండగా.. జవాల్కర్ 'జారా' క్యారక్టర్ పోషిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివ జెర్సీ ధరించి స్పోర్ట్స్ పర్సన్ లా కనిపిస్తున్నాడు. ప్రియాంక సాంప్రదాయ దుస్తులలో ధరించిన ఒక సాధారణ ముస్లిం అమ్మాయిగా కనిపిస్తుంది. పోస్టర్ ద్వారా ఈ జంట మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంటుందని అర్థం అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల ద్వారా సినిమా మీద ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్.. ఇప్పుడు శివ - ప్రియాంక ఫస్ట్ లుక్ ద్వారా సినిమాపై అంచనాలు కలిగిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా ఎంటర్టైనర్ కి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం సమకూర్చారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌ గా ప‌నిచేస్తున్న జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాతగా మారి ర‌మేష్ క‌రుటూరి - వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్త‌యిన 'గ‌మ‌నం' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ చిత్రంలో ప‌నిచేస్తున్న తారాగ‌ణం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.
Tags:    

Similar News