ఫోటో స్టోరి: పోకిరి లేడీ ఆ యాంగిల్ ఏమిటో!

Update: 2020-10-09 02:30 GMT
డ్యా‌షింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇండ‌స్ట్రీ హిట్ `పోకిరి`తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది జ్యోతి రానా అలియాస్ శివ రానా. ఆ త‌రువాత తెలుగు సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌ని ఈ హాట్ ఆట‌మ్ బాంబ్ బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్మించిన వెబ్ సిరీస్ `గందీబాత్` తో సంచ‌ల‌నం సృష్టించింది. రెచ్చిపోయి హాట్ హాట్ స‌న్నివేశాల్లో న‌టించి హీటెక్కించింది.

ఈ రెబ‌లియ‌న్ లేడీకి ఉత్త‌రాదిలోనూ సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్క‌పోవ‌డంతో వెబ్ ‌సిరీస్ ‌ల‌లో అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా హీటెక్కించే ఫొటోల్ని.. వీడియోల్నిషేర్ చేస్తూ మేక‌ర్స్ ‌ని ఎట్రాక్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

తాజాగా థై షో చేస్తూ ఇన్ స్టాలో శివా రానా షేర్ చేసిన ఫొటో నెటిజ‌న్స్ ‌ని ఆక‌ట్టుకుంటోంది. హాఫ్ ఉమెన్‌.. హాఫ్ వారియ‌ర్ డెలికేట్ అండ్ స్ట్రాంగ్` అంటూ త‌న ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇంత‌కీ వారియ‌ర్ అని చెప్పుకుంటోంది. దేనిలో వారియ‌ర్..? ఇండ‌స్ట్రీలో స‌మ‌స్య‌ల్ని ఫేస్ చేయ‌డం వ‌ల్ల‌నే ఆ రేంజుకు ఎదిగిందా? ఇంత‌కీ పోకిరి లేడీ ఆ యాంగిల్ ఏమిటో!
Tags:    

Similar News