కొత్తగా వస్తున్న సినిమాల్లో సక్సెస్ అయ్యేది ఎన్ని?
సమ్మర్ అనేది సినిమాలకు మంచి సీజన్. పిల్లల ఎగ్జామ్స్ పూర్తి కావడంతో ఇంటిల్లిపాదీ వినోదం కోసం థియేటర్లకు భారీ స్థాయిలో వస్తుంటారు.;
సమ్మర్ అనేది సినిమాలకు మంచి సీజన్. పిల్లల ఎగ్జామ్స్ పూర్తి కావడంతో ఇంటిల్లిపాదీ వినోదం కోసం థియేటర్లకు భారీ స్థాయిలో వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ తమ సినిమాలని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తూ వసూళ్లని రాబట్టాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ సమ్మర్ సీజన్ ఆశించినంతగా సినిమాలు థియేటర్లలో సందడి చేయలేకపోయాయి. కారణం పెద్ద సినిమాల రిలీజ్‌లు వాయిదా పడటం, ధురంధర్ 2 లాంటి డబ్బింగ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రభావాన్ని చూపిస్తుండటంతో పెద్ద సినిమాలు భారీ స్థాయిలో థియేటర్లలో సందడి చేయలేకపోయాయి.
ఇక ఇదే టైమ్‌లో రామ్ చరణ్ 'పెద్ది' భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తుందని ఎదురు చూసి తమ సినిమాల రిలీజ్‌లని వాయిదా వేసుకున్న మేకర్స్‌కి బిగ్ షాక్ తగిలింది. 'పెద్ది' వస్తుందని తమ సినిమాలని వాయిదా వేసుకుంటే ఇప్పుడు అది వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో దీని కోసం ఆపేసిన సినిమాలని ఇప్పుడు ఒక్కొక్కటిగా మేకర్స్ వదులుతున్నారు. చిన్న సినిమాల నుంచి భారీ డబ్బింగ్ మూవీస్ కూడా ఇప్పడు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 30న `పెద్ది` రావడం లేదని తేలిపోవడంతో మే 1 నుంచి చిన్న సినిమాలు, డబ్బింగ్ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.
ఇందులో ముందుగా వస్తున్న మూవీ 'గాయపడ్డ సింహం'. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 1న రిలీజ్ కాబోతోంది. ఇందులో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించడం, రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా మేకింగ్ గత చిత్రాలకు భిన్నంగా క్వాలిటీగా ఉండటం, ప్రమోషన్స్ కొత్తగా ఉండటంతో హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. కమెడియన్ సత్య హీరోగా నటించిన 'జెట్లీ' ది కూడా ఇదే దారి. మత్తువదలరా వంటి సినిమాలని అందించిన రితేష్ రానా రెగ్యులర్ మేకింగ్‌కి అవేగా తీసిన ఈ సినిమాపై కూడా మంచి టాక్ వినిపిస్తోంది.
కంటెంట్ ఆకట్టుకోగలిగితే ఇది కూడా హిట్ కావడం గ్యారంటీ అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. కొంత విరామం తీసుకున్న సమంత మే 15న 'మా ఇంటి బంగారం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. మర్యాద రామన్న టెంప్లెట్ లోనే కాస్త భిన్నమైన స్టోరీతో రూపొందిన ఈ మూవీకి కూడా పాజిటీవ్ వైబ్ కనిపిస్తోంది. ఇక వీటికి ముందు అంటే ఏప్రిల్ రెండవ వారంలో అడివి శేష్ డెకాయిట్, నాగశౌఔర్య `బ్యాడ్ బాయ్ కార్తీక్ తో పాటు చిన్న సినిమాలు తిమ్మరాజు పల్లి టీవి, పాపం ప్రతాప్, తెరచాప వంటి సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో అడివి శేష్ డెకాయిట్‌తో పాటు నాగశౌర్య `బ్యాడ్ బాయ్ కార్తీక్`పై మంచి బజ్ కనిపిస్తోంది.
ఇక స్ట్రెయిట్ సినిమాల పరిస్థితి ఇలా ఉంటే డబ్బింగ్ చిత్రాలు కూడా దండయాత్రకు రెడీ అవుతున్నాయి. మే 1న మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల మల్టీస్టారర్ మూవీ `పాట్రియాట్`, సాయి పల్లవి హిందీ డబ్బింగ్ `ఏక్ దిన్`, రితేష్ దేవ్‌ముఖ్ `రాజా శివాజీ`, ధనుష్ `కర`, ధృవ్ సర్జ `కేడీ ది డెవిల్` వంటి డబ్బింగ్ సినిమాల దండు వచ్చేస్తోంది. వీటిలో ధనుష్ `కర`, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల మల్టీస్టారర్ మూవీ `పాట్రియాట్`, రితేష్ దేవ్‌ముఖ్ `రాజా శివాజీ`లపై మంచి అంచనాలున్నాయి.