ఆ హీరో వ‌ల్లే ఇండ‌స్ట్రీలో ఉన్నా

సినీ ఇండ‌స్ట్రీలో త‌న టాలెంట్ తో పాటూ క్రమశిక్షణతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.;

Update: 2026-04-08 13:30 GMT

సినీ ఇండ‌స్ట్రీలో త‌న టాలెంట్ తో పాటూ క్రమశిక్షణతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చిన్న అవకాశమే తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా ఆ అవకాశానికి కారణమైన వ్యక్తిగా స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ పేరును ఆమె ప్ర‌స్తావించ‌డం విశేషం.

రీసెంట్ గా ఓ పోడ్‌కాస్ట్ లో మృణాల్, తన సినీ ప్రయాణంలోని కీలక మలుపును గుర్తుచేసుకున్నారు. ఒక హెయిర్ బ్రాండ్ కమర్షియల్‌లో రణవీర్ సింగ్‌తో కలిసి నటించే అవకాశం తనకు వచ్చిందని, ఆ యాడ్ రిలీజైన వెంట‌నే తాను డైరెక్ట‌ర్ల దృష్టిలో పడినట్లు తెలిపారు. అదే తనకు సినిమా అవకాశాల దారిని తెరిచిందని ఆమె స్పష్టం చేశారు. ర‌ణ్‌వీర్ గురించి మృణాల్ మాట్లాడుతూ, ఆయన నా లక్కీ చార్మ్. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే అందులో ఆయన పాత్ర ఉంద‌ని మృణాల్ ఎమోష‌న‌ల్ గా చెప్పారు. రణవీర్ సింగ్ యొక్క పాజిటివ్ ఎనర్జీ, ఎంక‌రేజ్‌మెంట్ తన కెరీర్‌కు ఎంతో దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక స్టార్ నటుడిపై మరో నటికి ఉన్న గౌరవాన్ని మాత్రమే కాకుండా, ఇండస్ట్రీలో చిన్న అవకాశాల ప్రాధాన్యతను కూడా తెలియజేస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా రణవీర్ నటించిన ధురంధ‌ర్2 సినిమా గురించి కూడా మృణాల్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ర‌ణ్‌వీర్ యాక్టింగ్ లో ఉన్న డెప్త్, పాత్రకు ఇచ్చిన ప్రాముఖ్యత తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. సినిమాలో తాను రణవీర్ సింగ్‌ను చూడలేద‌ని, కేవలం హమ్జా అనే పాత్రనే చూశాన‌ని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది ఒక నటుడి ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ఉన్న నిజమైన ప్రశంసగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక మృణాల్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె మొదట టెలివిజన్ రంగంలో కుంకుం భాగ్య ద్వారా గుర్తింపు పొందారు. తరువాత ల‌వ్ సోనియా తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత సూప‌ర్30, సీతా రామ‌మ్ వంటి సినిమాల్లో న‌టించి త‌న యాక్టింగ్ తో ఎన్నో ప్ర‌శంస‌లందుకున్నారు. ప్రస్తుతం మృణాల్ న‌టించిన తాజా సినిమా డెకాయిట్ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ప్పక అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని మృణాల్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.

Tags:    

Similar News