'రాకా'లో బ‌న్నీ ఆ క్యారెక్ట‌ర్లోనూ క‌నిపిస్తార‌ట‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీల కాంబినేష‌న్‌లో ఓ భారీ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-04-08 12:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీల కాంబినేష‌న్‌లో ఓ భారీ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. `పుష్ప 2` త‌రువాత ఏర్ప‌డిన బ‌న్నీ క్రేజ్‌కు త‌గ్గ‌ట్టుగా అత్యంత భారీ స్థాయిలో పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా దీన్ని స‌న్ పిక్చ‌ర్స్ అధినేత క‌ళానిధి మార‌న్ ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్త‌లు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసి ఈ సారి బ‌న్నీ నుంచి ఆశ్చ‌ర్య‌పోయే సినిమాని చూడ‌బోతున్నామ‌నే సంకేతాల్ని అందించారు. ఇదిలా ఉంటే ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ గురించి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు, సినీ ప్రియుల‌కు మేక‌ర్స్ ఒక్క‌సారిగా షాక్ ఇచ్చారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టైటిల్‌ని రివీల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన మేక‌ర్స్ షాకింగ్ లుక్ పోస్ట‌ర్‌తో అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ మూవీకి `రాకా` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన టీమ్ బ‌న్నీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రివీల్ చేసి షాక్‌కు గురి చేశారు. వోల్ఫ్ హ్యాండ్‌, గుండుతో ఉన్న బ‌న్నీ లుక్ అంద‌రిని షాక్‌కు గురి చేసింది. ఇంటెన్స్ లుక్‌తో ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తున్న బ‌న్నీ లుక్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతే కాకుండా ఇందులో బ‌న్నీ ఒక క్యారెక్ట‌రే చేస్తున్నాడా?

ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడా? అని అంతా ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. హీరో అయితే ఫ‌స్ట్ లుక్ ఇలా ఉండ‌దు. డెఫినెట్‌గా ఇందులో ఏదో సీక్రెట్ ఉంద‌ని అంతా చ‌ర్చించ‌డం మొద‌లు పెట్టారు. ఈ నేఫ‌థ్యంలోనే మేకర్స్ ఓ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఇందులో బ‌న్నీ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని, అందులో ఒక‌టి హీరో క్యారెక్ట‌ర్ కాగా మ‌రొక‌టి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ అని టీమ్ క్లారిటీ ఇవ్వ‌డంతో అంతా షాక్ అవుతున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూడ‌గానే అభిమానుల‌తో పాటు మీడియా వ‌ర్గాలు కూడా విస్మ‌యానికి గుర‌య్యాయి.

బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ని ప‌సిగ‌ట్ట‌లేనంత‌గా ఉండ‌టంతో అంతా అవాక్క‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా విడుద‌ల చేసిన లుక్‌పై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ యానిమ‌ల్ లుక్ విల‌న్ క్యారెక్ట‌ర్‌ద‌ని స్ప‌ష్టం చేసి స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు. ఇందులో బ‌న్నీ హీరోగా, విల‌న్‌గా న‌టిస్తున్నార‌ని మేక‌ర్స్ వెల్ల‌డించి సినిమాపై మ‌రింత హైప్‌ని క్రియేట్ చేశారు. దీంతో విల‌న్ లుక్ అద‌రిపోయింద‌ని, హీరో లుక్ కోసం వెయిట్ చేస్తున్నామ‌ని ఫ్యాన్స్ నెట్టింట ర‌చ్చ చేయ‌డం మొద‌లు పెట్టారు. బ‌న్నీ విల‌న్ లుక్కే ఇలా ఉంటే హీరో లుక్ ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు.

హాలీవుడ్ రేంజ్‌కి ఏ మాత్ం తీసిపోని స్థాయిలో ఈ మూవీని అట్లీ అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. ప‌లు హాలీవుడ్ సినిమాల‌కు వీఎఫ్ ఎక్స్‌ని అందించిన టెక్నిషియ‌న్స్ ఈ మూవీకి వ‌ర్క్ చేస్తుండ‌టం, ఫ‌స్ట్ లుక్‌లో బ‌న్నీ భిన్నంగా క‌నిపించ‌డంతో సినిమాపై అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. తెలుగు, హిందీతో స‌హా మొత్తం 7 భాష‌ల్లోనూ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇందులో బ‌న్నీకి జోడీగా బాలీవుడ్ స్టార్ లేడీ దీపిక ప‌దుకునే న‌టిస్తోంది.

Tags:    

Similar News