ఆ సీన్లు కన్పిస్తే హీరోకి కష్టమే..
టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో హిట్ల రేసులో కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. శతమానం భవతి సినిమా తర్వాత శర్వానంద్ మళ్లీ హిట్ అందుకోలేక పోయాడు. గతేడాది విడుదలైన రణరంగం, ఇటీవల స్టార్ బ్యూటీ సమంతతో కలిసి తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేసినా అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో శర్వా తన తదుపరి సినిమా పై ఆశలు పెట్టుకున్నాడట. నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు శర్వా.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో, ఈ సినిమా కథ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ఈ సినిమాలో కొత్త మ్యాటర్ ఏమీ లేదని ఈ సినిమా క్లైమాక్స్ సీన్ గురించి వింటే ఊరికే తెలిసి పోతుంది అంటున్నారట. ఈ సినిమాలో రైతులు పడుతున్న కష్టాలను మరోసారి ప్రేక్షకులకు చూపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ఛాయలు బాగానే కన్పిస్తాయని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. మహర్షిని చూపిస్తే మాత్రం మళ్లీ బోల్తా పడతావ్ అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి శర్వా కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందేమో..