• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెన్నెల కిశోర్...

వెన్నెల కిశోర్ తప్పించుకున్నాడు .. ఎక్కడున్నా వదలను: శర్వా

By - Tupaki Desk
Update: 2022-09-08 03:06 GMT
శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం' రూపొందింది. ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్ జోడీగా రీతూ వర్మ నటించిన ఈ సినిమాలో ఆయన తల్లి పాత్రను అమల అక్కినేని పోషించారు. తల్లి ప్రేమను పొందడం కోసం కాలంలో వెనక్కి వెళ్లే ఓకే కొడుకు కథ ఇది. ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్ బలంగా ఉన్న సినిమా ఇది. అలాంటి ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులో ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ స్టేజ్ పై శర్వానంద్ మాట్లాడుతూ .. "ముందుగా మా సినిమా టెక్నీషియన్స్ ను గురించి చెప్పుకోవాలి. పాటల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా జేక్స్ బిజోయ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ వర్క్ కూడా గొప్పగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టులంతా గొప్పగా చేశారు.

స్పెషల్ షో చూసిన వాళ్లంతా కూడా పిల్లలతో అంత బాగా ఎలా చేయించారు? అనే అడుగుతున్నారు. వాళ్లందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా నాది .. నేను హీరోని అనుకునే చేశారు. అందువల్లనే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది.

అందరం కలిసికట్టుగా ఈ సినిమా చేయడానికి కారణం .. కథనే. ప్రియదర్శి చాలా బాగా చేశాడు .. వెన్నెల కిశోర్ మాత్రం మిస్సయ్యాడు. ఈ సినిమా ఇప్పించింది కూడా నేనే .. వాడి సంగతి తరువాత  చెబుతాను. ' ఒరేయ్ కిశోర్ ఎక్కడున్నా గుర్తుపెట్టుకో .. వస్తున్నాను నీ దగ్గరికి' అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత  కొనసాగిస్తూ .. "ఈ సినిమాలో మీరు ఇంకో కిశోర్ ను చూస్తారు. ఇక  రీతూ వర్మ విషయానికి వస్తే ఒక మంచి సినిమాలో తాను ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు ఆమెకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

అమలగారు లేకుండా నేను ఈ సినిమాను ఊహించలేను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కలగడం  నా అదృష్టంగా భావిస్తున్నాను. అమలగారిలో నాకు మా అమ్మనే కనిపిస్తారు .. అందువలన నా పాత్ర పెద్ద కష్టంగా అనిపించలేదు.

ఈ సినిమా రిలీజ్ వరకూ సైలెంట్ గా ఉండమని అమలగారు చెప్పారు  .. అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. దర్శకుడు శ్రీకార్తీక్ ఈ సినిమాతో ఎక్కడికో వెళతాడనే నమ్మకం నాకు ఉంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్మాత ప్రభు, ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకుని రావడానికి వెయిట్ చేయడం గొప్ప విషయం. ఆడియన్స్ కి ఇది నా  ప్రామిస్. మిమ్మల్ని డిజప్పాయింట్ చేయను .. ఒక మంచి సినిమాను చూపిస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Sharwanand 
  • OkeOkaJeevitham 
  • SRPrabhu 
  • SriKarthik 
  • RituVarma 
  • AmalaAkkineni 
  • Hyderabad 
  • PreReleaseEvent 
  • VennalaKishore 
  • MovieNews 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS