• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహానుభావుడు...

మహానుభావుడు ఎక్కడున్నాడు..

By - Tupaki Desk
Update: 2017-10-10 09:27 GMT
దసరా సీజన్లో ‘జై లవకుశ’.. ‘స్పైడర్’ లాంటి భారీ సినిమాలతో పోటీ పడి బాక్సాఫీస్ విజేతగా నిలిచింది ‘మహానుభావుడు’. తొలి వీకెండ్లో ఈ సినిమా అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. ‘జై లవకుశ’.. ‘స్పైడర్’ దీని ముందు నిలవలేకపోయాయి. తొలి వారంలోనే రూ.17 కోట్లకు పైగా షేర్ రాబట్టి శర్వా కెరీర్లో ఫస్ట్ వీక్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ‘మహానుభావుడు’. ఐతే గత వీకెండ్లో కొత్తగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోయినా.. ‘జై లవకుశ’.. ‘స్పైడర్’ నామమాత్రంగా నడుస్తున్నా.. అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది ‘మహానుభావుడు’. అన్నీ కలిసొచ్చిన తరుణంలో ఈజీగా ఓ 5 కోట్లయినా షేర్ రాబడుతుందనుకుంటే.. వరల్డ్ వైడ్ మూడు కోట్లకు పైచిలుకు  షేర్ మాత్రమే రాబట్టిందా సినిమా.

ఓవరాల్ గా ఇప్పుడు ‘మహానుభావుడు’ రూ.20 కోట్ల షేర్ మార్కును దాటింది. రూ.20.5 కోట్ల దగ్గర ‘మహానుభావుడు’ నిలిచి ఉంది. ఓవర్సీస్‌ లో తొలి వీకెండ్లోనే హాఫ్ మిలియన్ మార్కును దాటిన ‘మహానుభావుడు’ ఆ తర్వాత ఆశించిన మేర వసూళ్లు రాబట్టలేకపోయింది. మిలియన్ డాలర్లు గ్యారెంటీ అనుకుంటే ఇంకా.. 7.5 లక్షల డాలర్ల దగ్గరే ఉందా సినిమా. పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. పోటీలో ఉన్న సినిమాలు డల్లయిన సమయంలో ‘మహానుభావుడు’ ఇలాంటి వసూళ్లు సాధించడం ఆశ్చర్యమే. తీవ్ర పోటీ మధ్య కూడా శర్వానంద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘శతమానం భవతి’ దరిదాపుల్లోకి కూడా ‘మహానుభావుడు’ అందుకునే అవకాశాలు లేవని తేలిపోయింది. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.35 కోట్ల దాకా షేర్ సాధించడం విశేషం.
Tags:    
  • Sharwanand 
  • Mahanubhavudu Movie 
  • Mahanubhavudu Collections 
  • Telugu NEWs 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS