ఆసక్తికరంగా శర్వా - సిద్ధార్థ్ 'మహా సముద్రం' థీమ్ పోస్టర్..!
వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ మరియు 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''మహా సముద్రం''. 'Rx 100' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ నటి అదితి రావు హైదరి - గార్జియస్ అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ బజ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 'మహా సముద్రం' థీమ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
'బైగోన్స్ బైగోన్స్ గా ఉండనివ్వండి... ప్రేమ ఎప్పటికీ ఉంటుంది' అంటూ విడుదల చేయబడిన 'మహాసముద్రం' థీమ్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ డిజైన్ సింపుల్ గా ఉంటూనే ఎంతో ఎఫెక్టివ్ గా కనిపిస్తోంది. ఇక థీమ్ పోస్టర్ లో అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఒక వైపు ప్రేమ మరొక వైపు యుద్ధం అని మేకర్స్ క్లియర్ గా చెప్తున్నారు. సముద్రం ఒడ్డున ఉన్న నగరాన్ని చూపించడంతో పాటు.. తుపాకీ పై ఓ జంట ఒకవైపు నిలుచుని ఉండగా మరోవైపు ఒక వ్యక్తి పరుగెడుతున్నట్లు చూపించారు. ఇది ఒక అపరిమితమైన లవ్ స్టోరీని చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 'మహా సముద్రం' థీమ్-పోస్టర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సందర్భంగా శర్వానంద్ ట్వీట్ చేస్తూ 'నేను తరంగాల కంటే మొండిగా ఉన్నాను.. సముద్రాల కంటే లోతుగా ఉన్నాను! ఎవరు నువ్వు?' అని పేర్కొన్నాడు.
కాగా, స్క్రిప్ట్ లో అందరికి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను క్రియేట్ చేసిన అజయ్ భూపతి.. దానికి తగ్గట్టే నటీనటులను సాంకేతిక నిపుణులను ఎంచుకున్నాడు. రాజ్ తోటా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూర్చనున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేయనుండగా కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.