• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రణరంగం రొమాన్స్ సూపర్ గా...

రణరంగం రొమాన్స్ సూపర్ గా ఉన్నట్టుందే!

By - Tupaki Desk
Update: 2019-07-18 12:48 GMT
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్.. కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'రణరంగం'.  రిలీజ్ కు నెలరోజులే ఉండడంతో ఇప్పటికే  ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి.  ఈమధ్యే టీజర్ ను.. ఫస్ట్ లిరికల్ సాంగ్ 'సీతాకళ్యాణం' ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ఈ సినిమా నుండి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు 'రణరంగం' టీమ్ రెడీ అవుతోంది.

జూలై 20 వ తారీఖున సాయంత్రం 04:05 గం. లకు 'కన్నుకొట్టి' అంటూ సాగే పాట ను విడుదల చేస్తామని తెలుపుతూ ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.  'కన్నుకొట్టు'అనగానే  రొమాంటిక్ సాంగ్ అని అర్థం అయిందిగా.. అదే విషయం పోస్టర్లో కూడా కన్ఫాం అయింది.  పోస్టర్ లో యంగ్ లుక్ లో ఉన్న శర్వానంద్ ప్రేమలో పడి.. ఆ ఫీల్ కు మురిసిపోయి సిగ్గుపడుతున్నట్టుగా ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. వెనక కళ్యాణి ప్రియదర్శన్ లంగా ఓణీ ధరించి తలలో పూలు తురుముకొని సూపర్ క్యూట్ గా నవ్వుతోంది.  మరి కన్ను ఎవరికి ఎవరు కొట్టారో.. శర్వా అందుకు అలా సిగ్గుపడుతున్నాడో పాట రిలీజ్ అయితే కానీ తెలీదు.  

'రణరంగం'లో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు.  యువకుడిగా.. మధ్యవయస్కుడైన డాన్ గా డిఫరెంట్ షేడ్స్ లో శర్వా నటన సినిమాకే హైలైట్ అవుతుందనే టాక్ ఉంది.   ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై.  ఈ సినిమాను ఆగష్టు 15 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
Tags:    
  • Sharwanand 
  • Kalyani Priyadashini 
  • Ranarangam Movie 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS