తన ఆఫీస్‌ ను ఐసీయూగా మార్చేసిన సూపర్‌ స్టార్‌

Update: 2020-08-11 17:30 GMT
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రులు చాలా వరకు ఫుల అవుతున్నాయి. అత్యవసర సేవలు అవసరం అయిన వారికి వెంటిలేషన్‌ అందించలేక పోతున్నారు. దాంతో పలువురు తమవంతు సాయంగా అత్యవసర వైధ్య సేవలు అవసరం అయిన వారికోసం ముందుకు వస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తన ఆఫీస్‌ను కరోనా వార్డుగా మార్చేందుకు ఒప్పుకున్నారు. ప్రముఖ ఆసుపత్రికి తన ఆఫీస్‌ను ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు.

ముంబయిలోని షారుఖ్‌ ఆఫీస్‌ ను ఐసీయూ గా మార్చేశారు. జులై నెలలోనే షారుఖ్‌ తన ఆఫీస్‌ ను హిందూజ ఆసుపత్రి వారికి అప్పగించారు. అది ఇప్పటికి పూర్తి స్థాయి ఐసీయూగా అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 15 బెడ్స్‌ ఉన్నాయి. 15 మంది అత్యవసర చికిత్స అవసరం అయిన పేషంట్స్‌కు ట్రీట్‌మెంట్‌ ను ఇక్కడ అందించవచ్చు. షారుఖ్‌ ఆఫీస్‌ ను ఐసీయూగా మార్చి వెంటిలేటర్స్‌ ఆక్సీజన్‌ నాజల్‌ ఆక్సీజన్‌ మెషిన్స్‌ అక్కడ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారికి అక్కడ ట్రీట్‌మెంట్‌ ఇవ్వబోతున్నట్లుగా హిందూజా సూపరింటెండ్‌ పేర్కొన్నారు.
Tags:    

Similar News