• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శంకర్ చెప్పేశాడు..ఆ ఆశలు...

శంకర్ చెప్పేశాడు..ఆ ఆశలు పెట్టుకోవద్దని

By - Tupaki Desk
Update: 2018-11-27 07:30 GMT
ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ మూవీ ‘2.0’ ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. రజనీకాంత్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా.. పైగా‘రోబో’కు సీక్వెల్ కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ఐతే ఆ అంచనాల్ని సినిమా ఏ మేరకు అందుకుంటుందో అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ‘రోబో’లో అంచనాల్ని మించిన వినోదం పంచిన శంకర్.. ఈసారి అంచనాలకు దగ్గరగా వచ్చినా గొప్పే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే దీనికి ముందు నుంచి వచ్చిన హైప్ అలాంటిది. నిజానికి ‘2.0’ ట్రైలర్ అయితే అంచనాలకు తగ్గట్లు లేదు. ప్రేక్షకులు ఆశించిన అంశాలు ఇందులో కనిపించలేదు. ‘రోబో’లో మాదిరి వినోదం.. రొమాన్స్ ఇందులో ఉన్నట్లుగా కనిపించలేదు. ఒకవేళ ట్రైలర్ వరకు అవి దాచి పెట్టి సినిమాలో ఏమైనా చూపిస్తారేమో అన్న ఆశ జనాల్లో ఉంది.

కానీ అందుకు అవకాశం లేదని స్పష్టం చేశాడు శంకర్. ‘రోబో’ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే వినోదాత్మక సన్నివేశాలు - రొమాన్స్ ఉన్నాయి కదా.. అలాంటివి ‘2.0’లోనూ ఉంటాయా అని అడిగితే.. ‘రోబో’లో ఉన్నవన్నీ ఇందులో కూడా ఎలా ఆశిస్తారు అని ఎదురు ప్రశ్నించాడు శంకర్. ‘2.0’లో కొత్త అంశాలు ఉంటాయని.. వాటిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారని శంకర్ చెప్పాడు. ఇది కంప్లీట్ యాక్షన్ ఫిలిం అని చెప్పడం ద్వారా కామెడీ - రొమాన్స్ లాంటి వాటిపై మాత్రం ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పాడు. కొద్ది మేర మాత్రం రొమాన్స్ ఉంటుందన్నాడు. ‘2.0’లో నిరాశ పరిచిన విషయం ఇదే. పూర్తిగా రజనీ-అక్షయ్ పోరాటం మీదే సినిమా నడిపించినట్లున్నాడు. సినిమా మొత్తం యాక్షనే ఉన్నట్లుంది. వీఎఫెక్స్ మాయాజాలంతోనే సినిమా సాగేట్లుంది. ఐతే దీన్నే నమ్ముకుంటే డోస్ ఎక్కువైపోదా అన్నది డౌటు. ‘రోబో’లో మాదిరి ఎంటర్టైన్మెంట్ - రొమాన్స్ లేకుంటే ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరా అని సందేహాలు కలుగుతున్నాయి. చూద్దాం మరి ఈ గురువారం ఏం జరుగుతుందో?
Tags:    
  • Shankar 
  • Robo 2.0 Movie 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS