శంకర్‌ మరో మూవీ.. ఇండియన్‌ 2 పరిస్థితి ఏంటీ?

Update: 2020-11-11 04:30 GMT
సౌత్‌ స్టార్‌ దర్శకుడు శంకర్‌.. కమల్‌ హాసన్‌ ల కాంబినేషన్‌ లో ప్రారంభం అయిన ఇండియన్‌ 2 సినిమాకు ఆరంభం నుండి ఏవో ఒక ఆటంకులు వస్తూనే ఉన్నాయి. మొదట బడ్జెట్‌ ఇష్యూ అన్నారు... ఆ తర్వాత సెట్‌ నిర్మాణం పూర్తి కాలేదు అన్నారు.. చివరికి సెట్‌ లో ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందడటంతో సినిమా నిలిచి పోయింది. ఈలోపు కరోనా రావడంతో ఆ సినిమా గురించిన చర్చనే జరగడం లేదు అని తేలిపోయింది. షూటింగ్‌ లు మెల్ల మెల్లగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంఓ ఇండియన్‌ 2 ను ప్రారంభించే అవకాశం ఉంది అనుకుంటూ ఉండగా వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కనుక వాటి కోసం గట్టిగా పోరాడేందుకు కమల్‌ హాసన్‌ సిద్దం అయ్యాడు.

కమల్‌ ప్రస్తుతానికి ఇండియన్‌ 2 సినిమా షూటింగ్‌ కు డేట్లు ఇచ్చే అవకాశం లేదు. కనుక ఈ గ్యాప్‌ లో శంకర్‌ మరో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కన్నడ హీరో కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా శంకర్‌ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆమద్య కేవలం యశ్‌ మాత్రమే కాకుండా తెలుగు మరియు తమిళం భాషల నుండి కూడా యంగ్‌ హీరోలను ఎంపిక చేసుకుని ఒక సినిమా ను చేసేందుకు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తూ శంకర్‌ కేవలం యశ్‌ తో మాత్రమే సినిమా చేయబోతున్నాడట. ఇద్దరి మద్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం అందుతోంది.

కేజీఎఫ్‌ తో పాన్‌ ఇండియా స్టార్‌ గా యశ్‌ గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్న కేజీఎఫ్‌ 2 సినిమా మరింత సూపర్‌ హిట్‌ అవ్వడం ఖాయం అని అప్పుడు యశ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో పోటీ పడేంతటి క్రేజ్‌ ను దక్కించుకుంటాడు అంటున్నారు. అందుకే యశ్ తో పాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కించేందుకు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఇండియన్‌ 2 పునః ప్రారంభించాలని అనుకుంటున్నారు. అప్పటి వరకు యశ్‌ మూవీని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో శంకర్‌ ఉన్నాడట. మరి ఈ మూవీ ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.
Tags:    

Similar News