రజినీకాంత్ జైలర్ 2 లో స్టార్ హీరో.. షారుక్ మాత్రం కాదండోయ్!

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశల్లో ఉంది. వెంటనే ఈ పనులను కూడా పూర్తి చేసి అనుకున్న సమయానికి తీసుకురావాలని చూస్తున్నారు.;

Update: 2026-04-21 10:30 GMT

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. వాస్తవానికి గతంలో వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేసి విమర్శలకు చెక్ పెట్టారు. ఈ ఒక్క సినిమాతో ఊహించని కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు రజనీకాంత్. ఈ సినిమాకు కొనసాగింపుగా జైలర్2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . ఇకపోతే నేడు ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది.

 

పైగా ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఫోటోలు , వీడియోలు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశల్లో ఉంది. వెంటనే ఈ పనులను కూడా పూర్తి చేసి అనుకున్న సమయానికి తీసుకురావాలని చూస్తున్నారు.వాస్తవానికి ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటివరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.. కానీ అభిమానులు మాత్రం రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొకవైపు ఈ సినిమా ఆగస్టులో విడుదల అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అంతకుముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపించగా.. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో షారుఖ్ ఖాన్ నటించడం లేదు కానీ మొదటి భాగంలో మాథ్యూ పాత్ర పోషించిన మోహన్ లాల్ మళ్లీ తన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జైలర్ 2 లో కూడా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు. ఇటీవలే ఆయన షూటింగ్ భాగాలను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇన్ని రోజులు ఈ సినిమాలో షారుక్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు రాగా వాటన్నింటికీ చెక్ పడింది. ఇక మోహన్ లాల్ ఎప్పటిలాగే మొదటి భాగంలో ఎలాగైతే మ్యాథ్యూ పాత్రలో ఆకట్టుకున్నారో ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా తన పాత్రతో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయిపోయారు.

ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా.. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్ , ఎస్ జే సూర్య , మోహన్ లాల్ , రమ్యకృష్ణ, మీర్నా మీనన్, యోగి బాబు వంటి పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

Tags:    

Similar News