• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్టికల్ 370 రద్దు...

ఆర్టికల్ 370 రద్దు తర్వాత... అక్కడ ఫస్ట్ సినిమా!

By - Tupaki Desk
Update: 2019-08-09 01:30 GMT
ఈమధ్య ఊరి పేర్లతో పెద్ద చిక్కొచ్చిపడింది.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత హాట్ టాపిక్ గా మారిన అంశం లడఖ్.  గతంలో మన తెలుగు పేపర్లలో ఆ ప్రాంతాన్ని ఇలానే ప్రస్తావించేవారు.  కానీ ఇప్పుడు దీనిని ఒకరు లద్ధాక్ అంటున్నారు. మరొకరు లదాక్ అంటున్నారు. ఇంకొకరు లడఖ్ అంటారు. ఎలా పిలవాలో.. ఎలా ఏ పేరుతో పిలిస్తే మనకు బొత్తిగా లోక జ్ఞానం లేదని అనుకుంటారో అని చాలామంది తికమకపడుతున్నారు.  ఆ పేర్లు పలకాలంటే ముందు వెనక అలోచిస్తున్నారు.  అందరూ లద్దాక్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే పేరు ఫిక్స్ అయిపోదాం.

ఇపుడు ఆ ఏరియా పేరు మీద ఎందుకు ఇంత ఇంట్రో అంటే ఈ ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో మొదటిసారిగా షూటింగ్ జరుపుకోనున్న చిత్రంగా 'షంషేరా' చరిత్రకెక్కనుంది.  రణబీర్ కపూర్.. సంజయ్ దత్.. వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు కరణ్ మల్హోత్రా.  ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.  ఈ సినిమా తాజా షెడ్యూల్ ను లద్దాక్ ఏరియాలో ప్లాన్ చేశారట.

అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా అవుట్ పుట్ బాగా రాలేదన్న కారణంగా నిర్మాత ఆదిత్య చోప్రా థియేట్రికల్ రిలీజు లేకుండా ఒకేసారి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కొద్ధిరోజులు గా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపి స్తున్నాయి. మరి అలాంటి పరిస్థితి ఉంటే "ఈ రేంజ్ లో లద్దాక్ ఏరియాలో షూట్ చేయడం ఎందుకు?" అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

అన్నట్టు.. ఇదొక్క సినిమానే కాదు యష్ రాజ్ బ్యానర్ లో తెరకెక్కిన మరో చిత్రం 'సందీప్ పింకీ ఫరార్' అవుట్ పుట్ పై కూడా ఆదిత్య కాన్ఫిడెంట్ గా లేడట. దాన్ని కూడా డిజిటల్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడం టూ వార్తలు వస్తున్నాయి.  ఈ లిస్టులో కరణ్ జోహార్ సినిమా కూడా మరొకటి ఉంది.. ఆ సినిమా సుశాంత్ రాజ్ పుత్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన   'డ్రైవ్'. మరి నిజంగానే ఈ సినిమాలను  డిజిటల్ రిలీజ్ తో సరిపెట్టుకుంటారా లేదా థియేటర్లలో కూడా రిలీజ్ చేస్తారా అనే విషయంపై కొద్దిరోజుల్లో  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Tags:    
  • Shamshera 
  • Telugu NEws 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS