ఫోటో స్టోరి: న‌గ్నంగా విరుచుకుప‌డిన హాట్ షామా

Update: 2021-01-09 07:45 GMT
బుల్లి తెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోటైన న‌టి షామా శికంద‌ర్. చాలామంది ఇత‌ర న‌టీమ‌ణుల్లానే బాలీవుడ్ లో త‌నదైన‌ హ‌వా సాగించేందుకు ఈ అమ్మ‌డు గ‌ట్టి ప్లాన్ తోనే సిద్ధంగా ఉంది. ఆ క్ర‌మంలోనే షామా వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది.

ప్ర‌స్తుత‌ సోష‌ల్ మీడియా యుగంలో షామా చెల‌రేగుతున్న తీరు స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవ‌ల వ‌రుస పెట్టి వేడెక్కించే ఫోటోషూట్ల‌తో దుమారం రేపిన షామా మాల్దీవుల విహారం నుంచి అగ్గి రాజేసే బికినీ ఫోటోల్ని షేర్ చేసింది.

నిన్న మొన్న‌టివ‌ర‌కూ ఈ విహార యాత్ర‌లో బికినీల‌న్నిటినీ గ్యాప్ లెస్ గా షేర్ చేసి అంత‌కంత‌కు హీట్ పెంచింది. ప్ర‌స్తుతం మ‌రో ట్రెండీ ఫోటోషూట్ తో యువ‌త‌రంపై మ‌త్తు చ‌ల్లుతోంది. షామా ఒక ర‌కంగా మోహిని అవ‌తారంలోకి మారి మాయ చేస్తోంద‌నే చెప్పాలి. న‌గ్నంగా ఎద అందాల‌ను ఎంతో క‌ళాత్మ‌కంగా ఊల్ జంతు ఛ‌ర్మంతో రూపొందించిన షాలువాతో క‌వ‌ర్ చేసింది. ఆ `థై సౌంద‌ర్యం` ఎక్క‌డా దాచ‌నేలేదు. డార్క్ షేడ్ లైటింగ్ లో షామా అందం ప‌దింత‌లు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ట్రెండింగ్ గా మారింది.

షామా కెరీర్ సంగ‌తి చూస్తే.. నిరంత‌రం టీవీ షోల‌తో బిజీ గా ఉండే ఈ బ్యూటీ 2019లో థ్రిల్ల‌ర్ మూవీ బైపాస్ రోడ్ లో న‌టించింది. ఆ త‌ర్వాత న‌టించిన సినిమాలేవీ కోవిడ్ వ‌ల్ల రిలీజ్ కాలేద‌ట‌. ఈ గ్యాప్ లోనే ఇలా యూత్ కి కావాల్సిన ఫోటోట్రీట్ ని ఇచ్చి యంగేజ్ చేస్తోంది.
Tags:    

Similar News