దుష్యంతుడు అక్క‌ణ్నుంచి.. ప్రియంవ‌ద ఇక్కణ్నుంచి!

Update: 2021-04-07 23:30 GMT
గుణ‌శేఖ‌ర్ ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. మహాభారత ఆదిపర్వం నుంచి అందమైన ప్రేమకథను ఆవిష్క‌రించ‌డానికి సిద్ధ‌మైన ఆయ‌న‌.. క‌థ మొదలు న‌టీన‌టుల ఎంపిక వ‌ర‌కు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

టైటిల్ పాత్ర‌ధారి శ‌కుంత‌ల కోసం సౌత్ మొత్తాన్ని జ‌ల్లెడ ప‌ట్టారు. ఆ త‌ర్వాత స‌మంత‌ను ఫైన‌ల్ చేశారు. అయితే.. ఒరిజిన‌ల్ క‌థ ప్ర‌కారం శకుంత‌ల‌తో దుష్యంతుడి రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. మ‌రి, సినిమాలో గుణ‌శేఖ‌ర్ ఎలా చూపించ‌బోతున్నాడో తెలియ‌దుగానీ.. స‌మంత శ‌కుంత‌ల‌గా న‌టిస్తోంద‌న‌గానే.. దుష్యంతుడు ఎవ‌ర‌నే ఆస‌క్తి ఎక్కువైంది.

ఈ పాత్ర‌కోస‌మూ అంద‌రినీ ప‌రిశీలించిన ద‌ర్శ‌కుడు.. చివ‌ర‌కు మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ ను ఫిక్స్ చేశారు. ఈ మ‌ధ్య‌నే ఆయ‌న సెట్స్ లో అడుగు పెట్టారు. షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఈ సినిమాలో శ‌కుంత‌ల ఇష్ట‌స‌ఖి పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర పేరు ప్రియంవ‌ద‌. ఈ క్యారెక్ట‌ర్ కూడా కీల‌కం కావ‌డంతో.. మ‌ళ్లీ సెర్చింగ్ మొద‌లు పెట్టి, చివ‌ర‌కు కోలీవుడ్ లో ఆగార‌ని టాక్‌.

త‌మిళ‌న‌టి అదితి బాల‌న్ ను ఈ పాత్ర‌లో తీసుకుంటున్నార‌ని స‌మాచారం. మ‌రి, ఇందులో నిజం ఎంత అన్న‌ది యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు తెలియ‌దు. మొత్తానికి న‌టీన‌టుల ఎంపిక‌లోనే ఇలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న గుణ‌శేఖ‌ర్‌.. సినిమాను ఎలా తెర‌కెక్కిస్తారో చూడాలి.
Tags:    

Similar News