• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శేఖర్ కమ్ముల.. మరో కొత్త...

శేఖర్ కమ్ముల.. మరో కొత్త సర్ ప్రైజ్

By - Tupaki Desk
Update: 2020-01-16 16:53 GMT
కొత్త టాలెంట్‌ ను బయటికి తీయడంలో కొందరు దర్శకులకు ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. అలాంటి దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి అతను ఎక్కువగా కొత్త ఆర్టిస్టులు - టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడ్డాక కూడా కమ్ముల ఈ శైలి విడిచిపెట్టలేదు. ఐతే ఏ కొత్త టెక్నీషియన్‌ తో పని చేసినా వాళ్ల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడం కమ్ములకే సొంతమైన నైపుణ్యం. అతను తరచుగా సంగీత దర్శకుల్ని మార్చడం.. కొత్త వాళ్లతో పని చేయడం మొదట్నుంచి చూస్తూనే ఉన్నాం. తొలి రెండు సినిమాలకు (ఆనంద్ - గోదావరి) రాధాకృష్ణ అనే యువ సంగీత దర్శకుడితో పని చేసిన కమ్ముల.. అతడి నుంచి ఎంత చక్కటి సంగీతం రాబట్టుకున్నాడో తెలిసిందే.

ఆ తర్వాత మిక్కీ జే మేయర్ అనే మరో మ్యూజిక్ సెన్సేషన్‌ ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. అతను కమ్ములతో చేసిన ‘హ్యాపీ డేస్’ - ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ పాటలు సూపర్ హిట్టయ్యాయి. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని ‘ఫిదా’తో రీఎంట్రీ ఇచ్చిన కమ్ముల.. ఆ సినిమాతో శక్తికాంత్ అనే సంగీత దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. అతను ఎంత మంచి పాటలందించాడో తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో ‘లవ్ స్టోరీ’ పేరుతో ఓ ప్రేమకథ తీస్తున్న కమ్ముల.. పవన్. సిహెచ్ అనే కొత్త సంగీత దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఈ పేరు ఇప్పటిదాకా ఎవరూ వినలేదు. ఈ సంగీత దర్శకుడికి ఇదే తొలి సినిమా. కమ్ముల ఛాన్స్ ఇచ్చాడంటే అతను టాలెంటెడే అయ్యుంటాడు. హృద్యమైన ప్రేమకథలా కనిపిస్తున్న ఈ సినిమాలో పాటలు - నేపథ్య సంగీతానికి మంచి ప్రాధాన్యమే ఉంటుంది. మరి కమ్ముల పరిచయం చేస్తున్న ఈ కొత్త సంగీత దర్శకుడు ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.


Tags:    
  • Shakti Kanth 
  • Naga Chaitanya 
  • Love Story Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS