• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షారుఖ్, కాజోల్.....

షారుఖ్, కాజోల్.. మిమ్మల్ని కొట్టేవాళ్లెవరు?

By - Tupaki Desk
Update: 2015-11-10 17:30 GMT

Full View
బాలీవుడ్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘దిల్ వాలే’ ట్రైలర్ వచ్చేసింది. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే చర్చ. తనను బాలీవుడ్ బాద్ షా అని, కింగ్ ఖాన్ అని ఎందుకంటారో మరోసారి రుజువు చేశాడు షారుఖ్ ఖాన్. తనకే సాధ్యమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి అతను ఇండియన్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇక ఇండియన్ స్క్రీన్ మీద షారుఖ్ - కాజోల్ ల కంటే అద్భుతమైన జంట మరొకటి ఉండదని కూడా ఈ ట్రైలర్ చాటి చెప్పింది.

నదిలో షారుఖ్ - కాజల్ కలిసి దగ్గరకు వచ్చి ఎమోషనల్ డైలాగులు చెప్పే సన్నివేశం చూస్తే.. ఇవి రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ విజువల్సేమో అన్న ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే షారుఖ్ - కాజోల్ అచ్చం ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో కనిపించినట్లే కనిపించారు. వాళ్లిద్దరూ ఏదైనా ఔషదం తాగి మళ్లీ యవ్వనంలోకి వెళ్లిపోయారా అని ఆశ్చర్యం కలిగేలా ఉంది ఆ సన్నివేశం.

ముఖ్యంగా షారుఖ్ అయితే అచ్చంగా ‘దిల్‌వాలే దుల్హానియో’లో లాగే కనిపించాడు. ఆ సినిమా తర్వాత చాలా ఏళ్ల విరామం తర్వాత ‘మై నేమ్ ఈజ్ ఖాన్’లో కనిపించిన షారుఖ్ - కాజోల్ జంట అందులో పెద్దగా ఆకట్టుకోలేదు. ఐతే ‘దిల్‌వాలే’లో మాత్రం వీళ్ల జంట మరోసారి కనువిందు చేయబోతోందనడంలో సందేహం లేదు. ట్రైలర్ అంత ప్రామిసింగ్ గా అనిపించింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    
  • Shahrukh Khan 
  • Kajol 
  • Dilwale Movie 
  • Telugu NEWs 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS