వేల కోట్ల కుంభ‌కోణంలో బాద్ షాకు వాటా?

Update: 2020-02-05 05:55 GMT
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కెరీర్ సందిగ్ధ‌త గురించి తెలిసిందే. ఓవైపు బాక్సాఫీస్ రేసులో వ‌రుస ప‌రాజ‌యాలు ఇబ్బందిక‌రంగా మారాయి. కోట్లాది రూపాయ‌లు పెట్టి సినిమాలు చేస్తున్నా ప‌రాజ‌యాలు త‌ప్ప‌డం లేదు. 2018 ఎండింగులో `జీరో` చిత్రంతో వ‌చ్చాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఆ సినిమాపై పెద్ద దెబ్బే ప‌డింది. షారూక్ జీరో అవ్వాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. దీంతో కొన్ని నెల‌లు గా కింగ్ ఖాన్ సైలెంట్ గానే ఉంటున్నాడు. సినిమాల‌ను ప‌క్క‌న‌ బెట్టి ఇత‌ర‌ బిజినెస్ వ్య‌వ‌హారాల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్నాడు. ఇక 2020 ఆరంభ‌మే కింగ్ ఖాన్ కి మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. ఓ ప్ర‌ముఖ చిట్ ఫండ్ కంపెనీ కుంభ‌కోణం లో షారూక్ భాగ‌స్వామి అంటూ ఈడీ బిగ్ షాక్ ఇవ్వ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

గ‌త కొన్నేళ్ల గా షారుక్ ఐపీఎల్ - కొల్ క‌త్తా నైట్ డైరెర్స్ టీమ్ య‌జ‌మాని గా కొన‌సాగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. కెకెఆర్ లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపిస్తూ.. కొన్నేళ్ల‌గా ఈడీ ద‌ర్యాప్తు చేస్తోంది. తాజాగా కెకెఆర్ లో పెద్ద ఎత్తున అవ‌కత‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ఈడీ నిర్ధారించింది. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభ‌కోణం వ్య‌వ‌హారం లో షారుక్ కు చెందిన కెకెఆర్ కు సంబంధం ఉందని ఈడీ నిర్ధారించింది. దాదాపు 70 కోట్ల సొమ్మును మనీ లాండరింగ్ యాక్ట్ కింద సీజ్ చేసినట్టు సమాచారం. ఇందు లో కెకెఆర్ స్పోర్స్ట్ తో పాటు మ‌ల్టీపుల్ రిసార్ట్స్ .. కొల్ క‌త్తా జేవియ‌ర్స్ కాలేజీకి సంబంధించిన ఖాతాల‌ను అధికారులు సీజ్ చేసారు. దీంతో షారుక్ కి బిజినెస్ ప‌రంగా పెద్ద షాక్ త‌గిలిన‌ట్లైంది. దాదాపు 17,520 కోట్ల కుంభ‌ కోణానికి సంబంధించిన కేసు లో షారూక్ - కేకేఆర్ ఇన్వాల్వ్ మెంట్ ఉంద‌న్న ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

కెకెఆర్ లో షారుక్ భార్య గౌరీ- న‌టి జుహిచావ్లా- ఆమె భ‌ర్త విజ‌య్ మోహ‌తా- వెంకీ మైసూరా డైరెక్ట‌ర్లుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరి ఖాతాల‌కు రోజ్ వ్యాలీ గ్రూప్ నుంచి నిధులు మ‌ళ్లింపు జ‌రిగింద‌ని తాజాగా ఈడీ నిర్ధారించింది. అయితే ఈ వ్య‌వ‌హా రం పై కెకెఆర్ వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాయి. షారుక్ కుటుంబానికి ఈడీ అటాచ్ మెంట్ తో ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ఆ కుటుంబానికి సంబంధించి కేవలం స్పాన్స‌ర్ షిప్ డీల్ మాత్ర‌మేనంటూ కొట్టి పారేసారు. 2015 నుంచి ఈడీ షారుక్ ని ఈ స్కాం విష‌యం లో ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News