సీరియల్స్ లా ఇకపై అక్కినేని వారి సినిమాలు

Update: 2021-06-13 13:30 GMT
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున ఇప్పటి వరకు పలు సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఇప్పటి వరకు ఇతర హీరోల సినిమాలను అన్నపూర్ణ స్టూడియోలో వరుసగా నిర్మించినదే లేదు. పలు సీరియల్స్ ను నిర్మిస్తున్న సదరు స్టూడియోలో ఇకపై వరుసగా తెలుగు సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను కూడా అన్నపూర్ణ వారు నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.

నాగార్జున వరుసగా చిన్న సినిమాలను నిర్మించేందుకు కథలు వింటున్నట్లుగా తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ టీమ్ ఇప్పటికే కొత్త వారితో సినిమాలను మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఏ సమయంలో అయినా ప్రారంభించే అవకాశం ఉందట. ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తుంది. కనుక అన్నపూర్ణ వారు కూడా వరుసగా ఓటీటీ సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

మరో వైపు నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా కూడా రూపొందుతోంది. ఆ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. నాగార్జున ఇక మీద నిర్మాణం పై మరింత శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నాడని ఆయన సన్నిహితులు ద్వారా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు అయినా అన్నపూర్ణ బ్యానర్ ద్వారా వచ్చే అవకాశం ఉందని అంటారు.
Tags:    

Similar News