• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీనియర్స్ విత్ యంగ్...

సీనియర్స్ విత్ యంగ్ హీరోయిన్స్...?

By - Tupaki Desk
Update: 2021-10-26 15:30 GMT
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారంతా ఆరు పదుల పడిలో ఉన్నారు. ఒక విధంగా చూస్తే రిటైర్ కావాలి, లేదా క్యారక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అవాలి. కానీ టాలీవుడ్ లో టాప్ సీనియర్లు అంతా కూడా ఈ రోజుకీ నాట్ అవుట్  అంటూ  హీరోలుగానే వెలుగొందుతున్నారు. దానికి వారికి ఉన్న స్ట్రాంగ్  ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక కారణమైతే. ఆడియన్స్ కూడా ఇంకా వారిని కోరుకోవడం మరో కారణం. ఇక మంచి మార్కెట్ కూడా వారికి ఉంది. సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. వారితో మంచి సబ్జెక్టులు చేయించడానికి డైరెక్టర్లు కూడా సై అంటున్నారు. అయితే ఒకే ఒక్క సమస్య ఉంది. అదే హీరోయిన్ల ప్రాబ్లం.

టాలీవుడ్ లో సీనియర్స్ కి అదే ఇపుడు అతి పెద్ద ట్రబుల్ గా ఉందిట. అన్నీ కుదురుతున్నాయి కానీ హీరోయిన్ జోడీగా లేకపోతే మాత్రం సినిమా మీద క్రేజూ మోజూ తగ్గిపోతాయి. ఇది పక్కా మార్కెట్ సూత్రం. మసాలా పండాలన్నా కూడా హీరోయిన్స్ సరైన వారు ఉండాల్సిందే. ఈ విషయంలోనే సీనియర్లు  ఇబ్బందులు పడుతున్నారు. బాలయ్య అఖండ మూవీకి ఎన్ని పేర్లు వినిపించాయో అందరికీ తెలిసిందే. చివరికి ప్రగ్యా జైస్వాల్ ని సెట్ చేశారు. నిజానికి బాలయ్య స్టార్ డమ్ కి వేరే వారు ఉండాలనే అంటారు.

ఇపుడు బాలయ్య గోపీచంద్ మలిఏనితో తీస్తున్న మూవీకి మాత్రం పెద్దగా ప్రాబ్లమ్స్ లేకుండానే శృతిహాసన్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అంటున్నారు. గోపీచంద్ తో ఉన్న రాపోతో పాటు, ఆమె ఉంటేనే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఇలా చాలా కలసి శృతి ఓకే చెప్పేసింది అంటున్నారు. మొత్తానికి బాలయ్య కొత్త మూవీ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న బోళా శంకర్ మూవీకి కూడా హీరోయిన్ దొరికింది అంటున్నారు. ఆమె ఎవరో కాదు, మిల్కీ బేబీ తమన్నా. ఈ అమ్మడు ఇప్పటికే సీనియర్ల పక్కన నటించేందుకు రెడీ అంటోంది. చిరంజీవితో కూడా సైరా నరసింహారెడ్డి మూవీలో యాక్ట్ చేసింది. కానీ ఈసారి పక్కాగా హీరోయిన్ అంటున్నారు.

మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కి ఎఫ్ టూ నుంచే హీరోయిన్ల సమస్య తీరిపోయింది. తమన్నా ఆ మూవీలో జట్టు కట్టింది. ఇక ఎఫ్ 3 లో కూడా సేమ్ కాంబోని కంటిన్యూ చేశారు. అక్కినేని నాగార్జున ప్రవీణ్ సత్తార్ మూవీకి మొదట కాజల్ అగర్వాల్ అనుకున్నారు, కానీ ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు రావడంతో ఆమె ప్లేస్ లో అమలాపాల్ ని తీసుకున్నారని లేటెస్ట్ టాక్. నాగ్ ఇంతకు ముందు మన్మధుడు టూ లో రకుల్ ప్రీత్ సింగ్ తో నటించారు. సో ఇపుడిపుడే సీనియర్లకు హీరోయిన సమస్య తీరుతోంది. టాలీవుడ్ లో ట్రెండ్ ని హీరోయిన్స్ కూడా ఫాలో అవుతున్నారు. చాలా మంది వచ్చిన అవకాశాలను బాగానే యూజ్ చెసుకుంటున్నారు. మొత్తానికి సీనియర్ హీరోల పక్కన యంగ్ హీరోయిన్స్ అంటే ఆ క్రేజే వేరు అని వేరేగా చెప్పాల్సిన పని లేదేమో.
Tags:    
  • Chiranjeevi 
  • Nagarjuna 
  • Bala Krishna 
  • Venkatesh Daggubati 
  • Mohan Babu 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS