బిబి3 లో సీనియర్‌ హీరోయిన్‌

Update: 2020-09-07 05:00 GMT
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలకృష్ణ.. బోయపాటి కాంబో మూవీ షూటింగ్‌ కరోనా కారణంగా మద్యలో నిలిచి పోయింది. ఆరు నెలలుగా సినిమా షూటింగ్‌ నిలిచే ఉంది. ఎట్టకేలకు బోయపాటి షూటింగ్‌ పునః ప్రారంభంకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు విలన్‌ ఎవరు అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. సినిమాలో సంజయ్‌ దత్‌ ను విలన్‌ గా చేయించాలని బోయపాటి అనుకున్నాడు. అందుకు సంజయ్‌ దత్‌ తో కూడా సంప్రదించారనే వార్తలు వచ్చాయి. కాని ఇటీవలే సంజయ్‌ దత్‌ కు క్యాన్సర్‌ అంటూ నిర్థారణ అయ్యింది. దాంతో ఆయన ప్లేస్‌ లో మరో బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ ఎవరిని అయినా నటింపజేయాలని భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు గాను నిన్నటితరం స్టార్‌ హీరోయిన్‌ మీనాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బోయపాటి శీను గతంలో బాలయ్యతో సింహా మరియు లెజెండ్‌ సినిమాలు తీశాడు. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బోయపాటి కీలక పాత్రకు గాను మీనాను ఎంపిక చేయడంతో మరింతగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. మీనా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కనిపిస్తుందా లేదంటే మరేదైనా కీలక పాత్రలో కనిపించబోతుందా అనేది చూడాలి.
Tags:    

Similar News